దమ్ముంటే.. మొగోడివైతే రా… జేసీకి పెద్దారెడ్డి సవాల్

జేసీ ప్రభాకర్ రెడ్డిపై తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సవాల్ విసిరారు. జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరులే పెద్ద ఆక్రమణదారులని ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఆరోపించారు. దమ్ముంటే, మొగోడివైతే [more]

Update: 2021-07-26 08:03 GMT

జేసీ ప్రభాకర్ రెడ్డిపై తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సవాల్ విసిరారు. జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరులే పెద్ద ఆక్రమణదారులని ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఆరోపించారు. దమ్ముంటే, మొగోడివైతే అనుచరుల ఆక్రమణలు లేవని అంగీకరించాలని పెద్దారెడ్డి ఛాలెంజ్ చేశారు. జేసీ అనుచరులే తాడిపత్రిలో డ్రైనేజీలు కూడా ఆక్రమించి భవనాలను నిర్మించారన్నారు. తన అనుచరుల ఆక్రమణలను కూడా తాను తొలగించాలని ఆదేశించానని పెద్దారెడ్డి తెలిపారు. మున్సిపల్ స్థలాల్లోనే కమర్షియల్ కాంప్లెక్స్ లు కట్టారని పెద్దారెడ్డి ఆరోపించారు. ఏ విచారణకైనా తాను సిద్ధమని పెద్దారెడ్డి అన్నారు.

Tags:    

Similar News