ట్యాంక్ బండ్ మూసి వేత

ఆర్టీసీ జేఏసీ చలో ట్యాంక్ బండ్ కార్యక్రమానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో ట్యాంక్ బండ్ ప్రాంతాన్ని పూర్తిగా మూసివేశారు. పోలీసులు తమ అధీనంలో ఉంచుకున్నారు. ఉదయం 6 గంటల [more]

Update: 2019-11-09 03:36 GMT

ఆర్టీసీ జేఏసీ చలో ట్యాంక్ బండ్ కార్యక్రమానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో ట్యాంక్ బండ్ ప్రాంతాన్ని పూర్తిగా మూసివేశారు. పోలీసులు తమ అధీనంలో ఉంచుకున్నారు. ఉదయం 6 గంటల నుంచి ట్యాంక్ బండ్ పై రాకపోకలను అధికారులు నిలిపివేశారు. ఆర్టీసీ చలో ట్యాంక్ బండ్ సందర్భంగా ట్యాంక్ బండ్ పై ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ట్యాంక్ బండ్ వైపు వచ్చే రూట్లను మళ్లించినట్లు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ట్యాంక్ బండ్ పై రాకపోకలను పూర్తిగా నిషేధించామని తెలిపారు.

దారి మళ్లింపు…

సికింద్రాబాద్ నుంచి ట్యాంక్ బండ్ కు వచ్చే రూట్ ని కవాడిగుడా వైపు మళ్లించారు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుంచి ఇందిరా పార్కుకు వచ్చే వాహనాలు అశోక్ నగర్ నుంచి మళ్లించారు. తెలుగు తల్లి ఫ్లైఓవర్ వైపు వెళ్లే వాళ్ళు ఆల్టర్నేటివ్ దారిలో వెళ్లాలని సూచించారుక. హిమాయత్ నగర్ దగ్గర నుంచి ట్యాంక్ బండ్ వచ్చే వాళ్ళు బషీర్ బాగ్ వైపు మళ్లించారు. ట్యాంక్ బండ్ వైపు వచ్చే అన్ని దారులను పోలీసులు మూసివేశారు. తెలంగాణ వ్యాప్తంగా నేతల ముందస్తు అరెస్టులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే జేఏసీకి కి సంబంధించిన ముఖ్య నాయకులను అరెస్ట్ చేశారు.

Tags:    

Similar News