రీపోలింగ్ ను నిరసిస్తూ టీడీపీ ఆందోళన
చంద్రగిరి నియోజకవర్గంలో ఐదో పోలింగ్ బూత్ లలో రీపోలింగ్ జరపాలని ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయానికి నిరసనగా తెలుగుదేశం పార్టీ ఆందోళనకు దిగింది. మంత్రి అమర్ నాథ్ [more]
చంద్రగిరి నియోజకవర్గంలో ఐదో పోలింగ్ బూత్ లలో రీపోలింగ్ జరపాలని ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయానికి నిరసనగా తెలుగుదేశం పార్టీ ఆందోళనకు దిగింది. మంత్రి అమర్ నాథ్ [more]
చంద్రగిరి నియోజకవర్గంలో ఐదో పోలింగ్ బూత్ లలో రీపోలింగ్ జరపాలని ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయానికి నిరసనగా తెలుగుదేశం పార్టీ ఆందోళనకు దిగింది. మంత్రి అమర్ నాథ్ రెడ్డి, చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని ఆధ్వర్యంలో తిరుపతి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. ఈ ఐదు పోలింగ్ బూత్ లలో 89 శాతం పోలింగ్ నమోదైందని, అవసరం లేకపోయినా రీపోలింగ్ చేస్తున్నారని ఆరోపించారు. నియోజకవర్గంలో 25 పోలింగ్ బూత్ లలో అక్రమాలు జరిగినందున రీపోలింగ్ జరపాలని తాము ఈసీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, 7 పోలింగ్ బూత్ లపై వైసీపీ ఫిర్యాదు చేస్తే ఐదు బూత్ లలో రీపోలింగ్ జరపాలని ఈసీ నిర్ణయం తీసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఐదు పోలింగ్ బూత్ లలో దళితులను ఓట్లు వేయకుండా అడ్డుకున్నారని, రీపోలింగ్ జరపాలని వైసీపీ ఫిర్యాదు చేసినందున రీపోలింగ్ జరపాలని ఈసీ నిన్న నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.