గురు దేవో మహేశ్వరహ...!

"గురు బ్రహ్మ, గురు విష్ణు గురు దేవో మహేశ్వరహ గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః"

Update: 2023-09-05 07:32 GMT

గురు దేవో మహేశ్వరహ...!

"గురు బ్రహ్మ, గురు విష్ణు

గురు దేవో మహేశ్వరహ

గురు సాక్షాత్ పరబ్రహ్మ

తస్మై శ్రీ గురవే నమః"

భారతీయ సంప్రదాయం ప్రకారం విద్యను ప్రసాదించే గురువు మనలను సష్టించిన బ్రహ్మతో సమానం, గురు విఘ్ణ అంటే అజ్నాన తిమిరాలను తరిమికొట్టే విష్ణుమూర్తి. గురువు సాక్షాత్ ప్రత్యక్ష దైవంగా భారతీయ ఇతిహాస, పురాణాలు చెబుతున్నాయి. సాధారణంగా మనందరికీ గురువు అనగానే విద్యను అందించే ఉపాధ్యాయుడే గుర్తుకు వస్తాడు. అయితే గురువు ఎలా ఉండాలి ? ప్రస్తుత గురు శిష్య సంబంధాలు ఎలా ఉన్నాయన్నది తెలుసుకుందాం..

మనకు స్వాతంత్ర్యానంతరం రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత మాత్రమే బడి ఈడు పిల్లలంతా పాఠశాలల్లో ఉండాలన్నది చట్టబద్దం అయ్యింది. అంతకు ముందు విద్యను నేర్చుకునే అవకాశం మూడు వర్గాలకు (బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య) మాత్రమే అందుబాటులో ఉండేది. దీనిపై ఆనాటి పెద్దలంతా పార్లమెంటులోనే అంబేద్కర్ ను ప్రశ్నించారు. కులమతాలకు అతీతంగా అందరినీ బడికి పంపితే మా పశువుల కొట్టంలో పశువులను కాసే పిల్లలు ఎవరుంటారని ? అదీ మన సామాజిక వ్యవస్థ. దేశంలో సగం కంటే ఎక్కువ మంది విద్యా, ఆర్థిక, సామాజిక లేమితో బాధపడుతుంటే దేశం ప్రగతిపథంలో నడవడం అసాధ్యం.

రాజ్యాంగంలోని ఆర్టికల్ 51 (ఎ) (1) ప్రకారం శాస్త్రీయ విద్యను విద్యార్థులకు అందించాలి. (ఈ మధ్య కొన్ని రాష్ట్రాల్లో చేతబడి, తాంత్రిక విద్యలను అందుబాటులోకి తెచ్చారు.) అది సమాజ ఉన్నతికి తోడ్పడాలి. సరైన విద్యా, వైద్యం అందించలేని ప్రభుత్వాలు, ఆదేశ ప్రజలను మోసం చేసినట్లే అని ప్రపంచ కమ్యూనిస్టు యోధుడు చెగోవీరా ఆనాడే చెప్పారు.

నేటి కేంద్ర ప్రభుత్వం సీబీఎస్ సీ సిలబస్ నుంచి ప్రజాస్వామ్యం, భిన్నత్వంలో ఏకత్వం, ప్రధమ ప్రదాని నెహ్రూ ప్రవేశపెట్టిన అలీనోద్యమం, (అగ్రదేశాల వెనకపడకుండా తటస్థ వైఖరి) ఉర్థూ కవి ఫైయాజ్ అహ్మమద్ కవితలు, అగ్రికల్చర్ పై గ్లోబలైజేషన్ ప్రభావం వంటివి తీసివేశారు. అలాగే ముస్లిం రాజుల పరిపాలన కూడా తొలగించారు. చార్మినార్, కుతుబ్ మీనార్, ఎర్రకోటవంటివి ఎలా వచ్చాయి అని విద్యార్థులు అడిగితే ఏం చెబుతారో...


కేరళలోని ఎల్ డీ ఎఫ్ ప్రభుత్వం వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా 95 కొత్త పాఠశాల భవనాలను సీఎం పినరాయి విజయ్ ప్రారంభించారు. వాటిలో 20 పాఠశాలలను మత్స్యకార కుటుంబాలకు అందుబాటులో ఉండే విధంగా సముద్ర తీరాల్లో నిర్మించారు. విద్యార్థులందరికీ నాణ్యమైన విద్య అందించాలంటే ప్రైవేటు పాఠశాలలను రద్దు చేయాలని మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి చెబుతున్నారు. ఏపీలో నాణ్యమైన విద్య కోసం ఆయన పనిచేస్తున్నారు. ఏపీలో నిరక్షరాస్యుల సంఖ్య ఎక్కువగా ఉందన్న కారణంతో వైసీపీ ప్రభుత్వం అమ్మ ఒడి పేరుతో 1 నుంచి 12 వరకు చదివే పేద పిల్లలకు ఏడాదికి రూ.15 వేలు అందించి ప్రభుత్వపాఠశాల విద్యార్థులు ర్యాంకులు తెచ్చుకునే విధంగా తీర్చిదిద్దుతోంది.

దేశంలో మొదటిగా ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్కూళ్లగా తీర్చి దిద్దింది మాత్రం ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వమే.. పెచ్చులూడిపోతున్న బడులను స్వచ్ఛంద సంస్థలు, ఎన్ ఆర్ ఐల ప్రోత్సాహంతో వాటిని మెరుగైన అత్యాధునిక వసతులున్న భవనాలుగా మార్చిన ఘనత అక్కడి సీఎం కేజ్రీవాల్ కు దక్కుతుంది. అక్కడి నుంచి స్ఫూర్తి పొందిన ఆంధ్రప్రదేశ్ నాడు –నేడు పేరుతో కనీస సౌకర్యాలు లేని పాఠశాలలకు నిధులు కేటాయించి ఇంగ్లీషు మీడియం స్కూళ్లను పేద, మధ్య తరగతి వారికి అందుబాటులోకి తెచ్చింది.

పిల్లలకు ఏదంటే ఆ ఆహారం పెట్టకుండా ఎలాగైతే సరైన ఆహారం ఇస్తున్నామో మన ఆలోచనలు, భావాలు వారిలోకి చొప్పించకుండా స్వతంత్ర్యంగా ఆలోచించే శక్తి ఇవ్వాలి. సత్యం కనుగొనేలా చేయాలని ప్రసిద్ద విద్యావేత్త గిజుబాయి చెబుతున్నారు. ప్రభుత్వాలు టీచర్ల స్థానంలో తక్కువ జీతాలతో విద్యావాలెంటర్లను ఏర్పాటు చేసి విద్యార్థుల నుంచి నాణ్యమైన విద్యను వేరుచేస్తున్నారు.

నేటి కేంద్ర ప్రభుత్వం విద్యకు బడ్జెట్ ను నామమాత్రంగా కేటాయిస్తోంది. అంతే కాకుండా విద్యార్థుల నోట్ పుస్తకాలు, పెన్ను, పెన్సిల్ పేపర్లపై 18 శాతం జీఎస్టీ వేస్తోంది. విద్యావేత్తలంతా దీనిపై కేంద్రాన్ని నిలదీయాలి. కేంద్ర ప్రభుత్వం గతేడాది 20 వేల బడులను మూసివేసింది. దీంతో 2.8 లక్షల ఉపాధ్యాయ పోస్టులు తగ్గాయని కేంద్ర విద్యాశాఖ పార్లమెంటులో నివేదిక ఇచ్చింది.

బీజేపీ ప్రభుత్వం రూ.3000 కోట్లతో పటేల్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే, కేరళ ప్రభుత్వం రూ.2,300 కోట్లతో వెయ్యి ప్రపంచస్థాయి స్కూళ్లను నిర్మించింది. గుజరాత్ లో 906 బడుల్లో ఒకే టీచర్ పనిచేస్తున్నారు అంతేకాకుండా మధ్యాహ్న భోజనాలు కూడా వారే వండి పెట్టాలి. టీచర్ – విద్యార్థుల నిష్పత్తిలో కేరళ 1:10తో ముందుంది. గుజరాత్ లో 1:90, ఉత్తరప్రదేశ్ లో 1:72 ఉన్నారు.

తమిళనాడులోని స్టాలిన్ ప్రభుత్వం పేద విద్యార్థులు ఉదయం నుంచి మధ్యాహ్న భోజనం కోసం ఎదురు చూడకుండా నాణ్యతతో కూడిన ఆరోగ్యకరమైన అల్ఫాహారాన్ని అందచేస్తుండగా, ఉత్తరప్రదేశ్ లోని యోగీ ప్రభుత్వం ఆరోగ్యకరమైన గుడ్డునుకూడా తీసివేసి ఉప్పువేసిన అన్నాన్ని పెడుతున్నారు.

ఉత్తమ గురువంటే...

కుల, మతాలకు అతీతంగా విద్యాదానం చేసేవారు ఉత్తమ గురువు. దాహం వేస్తుందని ఉన్నత కులాల వారి కుండలోని నీరు తాగిన 1వ తరగతి విద్యార్థిని కొట్టికొట్టి చంపేసే వాడు కాదు.. హోం వర్కు చేయలేదని, పిల్లలందరితో చెంపపై గట్టిగా కొట్టూ అంటూ దగ్గరుండి కొట్టించేవారు కాదు.. జై శ్రీరాం అని బోర్డు మీద రాసిన విద్యార్థిని క్లాసు బయటకు ఈడ్చుకు వెళ్లి చావబాదేవాడు కాదు.. కులాలకు, మతాలకు అతీతంగా సమధర్మం, సమన్యాయం బోధించి విద్యార్థిలో స్వేచ్ఛతోకూడిన మేథోసంపత్తిని పెంచి తద్వారా దేశప్రగతికి సహకరించేవారే ఉత్తమ గురువులు. అలాంటి గురువులందరికీ వినయపూర్వక నమస్సులు...

Tags:    

Similar News