చేయి తిప్పిన మొనగాడు

టీం ఇండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మరో అరుదైన ఘనతను సాధించాడు. ఐసీసీ టెస్ట్ బౌలర్ల జాబితాలో అగ్రస్థానాన నిలిచాడు

Update: 2023-03-01 12:28 GMT

టీం ఇండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మరో అరుదైన ఘనతను సాధించాడు. ఐసీసీ టెస్ట్ బౌలర్ల జాబితాలో అగ్రస్థానాన నిలిచాడు. ఇది ఒక్కరోజులో అశ్విన్ పడిన శ్రమకు దక్కిన ఫలితం కాదు. కష్టనష్టాలకోర్చి సాధించిన ఘనత మాత్రమే. అశ్విన్ తన చేతితో బాల్ ను స్వింగ్ చేస్తూ ప్రత్యర్థులను బోల్తా కొట్టించడంలో దిట్ట. టెస్ట్ ర్యాంకుల్లో ప్రస్తుతం ప్రధమ స్థానంలో ఉన్న ఇంగ్లండ్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ రెండో స్థానంలోకి పడిపోయాడు.

నలభై ఏళ్ల వయసులోనూ...
ఇక నలభై ఏళ్ల వయసులోనూ ఏమాత్రం పస తగ్గని ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్. వయసులోనూ ఈ ర్యాంక్ ను సాధించిన ఆటగాడిగా రికార్డులకెక్కారు. 1936లో ఆస్ట్రేలియా క్రికెటర్ క్లార్రీ గ్రిమ్మెట్ తర్వాత పెద్ద వయసులో నెంబరు వన్ ర్యాంకు సాధించిన అశ్విన్ ఇంకా వికెట్లు పడగొడతానని తొడగొడుతున్నాడు. ఇక కుడిచేతి బ్యాట్స్ మెన్ అయిన అశ్విన్ టెస్ట్ ఫార్మాట్ లో ఆల్ రౌండర్ల జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. మొదటి స్థానంలో రవీంద్ర జడేజా ఉన్నాడు.
వేగంగా వికెట్లు...
1986లో జన్మించిన అశ్విన్ ఆఫ్ స్పిన్ వేయడంలో దిట్ట. తమిళనాడు జట్టు నుంచి టీం ఇండియాలో చోటు దక్కించుకున్న అశ్విన్ ఇక వెనుదిరిగి చూడలేదు. దశాబ్దాలుగా టీం ఇండియాకు అవసరమైన ఆటగాడిగా మారిపోయారు. అశ్విన్ టెస్ట్ క్రికెట్ లో అతి వేగంగా 50, 100, 150 వికెట్లు సాధించిన ఘనతను కూడా దక్కించుకున్నాడు. తాజాగా ఐసీసీ టెస్ట్ ర్యాంకుల్లో తొలి ర్యాంకు సాధించిన అశ్విన్ ను అభినందించి తీరాల్సిందే. ఆ చేయి తిరిగినన్నాళ్లూ ప్రత్యర్థి క్రికెటర్ల వికెట్లు తాము ఊహించకుండానే కోల్పోవాల్సి వస్తుందనడంలో అతిశయోక్తి లేదు.


Tags:    

Similar News