బ్రేకింగ్ : తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా పోచారం

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. బాన్స్ వాడ నుంచి ఆయన టీఆర్ఎస్ తరపున [more]

Update: 2019-01-17 08:45 GMT

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. బాన్స్ వాడ నుంచి ఆయన టీఆర్ఎస్ తరపున గెలిచిన సంగతి తెలిసిందే. స్పీకర్ గా పోచారం నామినేషన్ దాఖలు చేశారు. ఆయన అభ్యర్థిత్వానికి అన్ని పార్టీలు మద్దతు తెలిపారు. నామినేషన్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్, కాంగ్రెస్ నుంచి మల్లు భట్టి విక్రమార్క, ఎంఐఎం నుంచి బలాలా హాజరయ్యారు. పోటీ లేకపోవడంతో స్పీకర్ గా పోచారం ఎంపిక లాంఛనమే కానుంది.

Tags:    

Similar News