మంత్రివర్గ విస్తరణకు బ్రేక్

తెలంగాణలో మంత్రివర్గవిస్తరణకు మరో బ్రేక్ పడింది. పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటంతో మంత్రివర్గ విస్తరణ చేపట్టకూడదని ఎన్నికల సంఘం తెలియజెప్పింది. ఇప్పటికే పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ అమల్లోకి [more]

Update: 2019-01-02 12:12 GMT

తెలంగాణలో మంత్రివర్గవిస్తరణకు మరో బ్రేక్ పడింది. పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటంతో మంత్రివర్గ విస్తరణ చేపట్టకూడదని ఎన్నికల సంఘం తెలియజెప్పింది. ఇప్పటికే పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ అమల్లోకి వచ్చిందని విస్తరణ వద్దని ఎన్నికల కమిషన్ పేర్కొంది. నిజానికి సంక్రాంతి పండగ తర్వాత ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మంత్రి వర్గ విస్తరణ చేపట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు కసరత్తులు కూడా పూర్తి చేశారు. తొలిదశలో పది మంది వరకూ మంత్రివర్గంలోకి తీసుకోవాలనుకున్నారు.కానీ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ తో విస్తరణ ఫిబ్రవరిలో జరిగే అవకాశముంది. తెలంగాణ ఎన్నికలు జరిగి ఫలితాలు గత నెల 11వ తేదీన విడుదలయ్యాయి. తర్వాత ముఖ్యమంత్రిగా కేసీఆర్ తో పాటు మహమూద్ ఆలీలు మాత్రమే ప్రమాణస్వీకారం చేశారు. పదవులపై ఆశలు పెంచుకున్న గులాబీ పార్టీ నేతలు మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. మంచిరోజులు లేవన్న కారణంగా మంత్రివర్గ విస్తరణను సంక్రాంతి పండగ తర్వాత జరపాలని కేసీఆర్ అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ అవకాశం లేకుండా పోయింది.

Tags:    

Similar News