ముగిసిన కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలివే

తెలంగాణ మంత్రి వర్గ సమావేశం ముగిసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

Update: 2022-09-03 12:39 GMT

తెలంగాణ మంత్రి వర్గ సమావేశం ముగిసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సెప్టంబరు 17న జాతీయ సమైక్యత దినంగా జరపాలని కేబినెట్ నిర్ణయించింది. 16, 17,18 తేదీల్లో తెలంగాణ వ్యాప్తంగా వజ్రోత్సవాలు నిర్వహించాలని కూడా నిశ్చయించింది. తెలంగాణ రాచరికం నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థలోకి ప్రవేశిస్తున్న తరుణంలో వజ్రోత్సవాలను ఘనంగా జరపాలని కేబినెట్ భావించింది.

వజ్రోత్సవాలను మూడు రోజుల పాటు....
తెలంగాణలో వజ్రోత్సవాలను మూడు రోజుల పాటు చేయాలని, ప్రారంభోత్సవ వేడుకలను ఘనంగా జరపాలని కేబినెట్ సమావేశం అభిప్రాయపడింది. దీంతో పాటు ఈ నెల 6వ తేదీ నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లోనూ విపక్షాలకు ధీటుగా కౌంటర్ ఇవ్వాలని నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పట్ల అనుసరిస్తున్న వైఖరిని ప్రజల ముందు ఉంచేలా సమావేశంలో చర్చ జరపాలని సమావేశంలో మంత్రులు అభిప్రాయపడ్డారు. అప్పులు పేరు చెప్పి అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని సమావేశంలో అభిప్రాయం వ్యక్తమయింది. దాదాపు మూడు గంటల పాటు తెలంగాణ మంత్రి వర్గ సమావేశం కొనసాగింది.


Tags:    

Similar News