సిట్టింగ్ లకే మళ్లీ సీట్లు... కేసీఆర్ కీలక వ్యాఖ్యలు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ శాసనసభ పక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ శాసనసభ పక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలకే ఈసారి టిక్కెట్లు ఆయన చెప్పారు. ఈసారి కూడా గెలుపు తమదేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇప్పుడు ఎన్నికలు జరిగితే టీఆర్ఎస్ కు 72 నుంచి 80 స్థానాలు రావడం ఖాయమని తెలిపారు. తెలంగాణలో బీజేపీ మనల్ని ఏమీ చేయలేదని కేసీఆర్ అన్నారు. సీబీఐ, ఈడీని కేంద్రం దుర్వినియోగం చేస్తుందన్నారు. మునుగోడులో 41 శాతం టీఆర్ఎస్ కు ఓట్లు వస్తాయన్నారు. కాంగ్రెస్ కు రెండో స్థానం, బీజేపీకి మూడో స్థానం దక్కుతుందన్నారు.
మునుగోడులో గెలుపు...
ఇతర రాష్ట్రాల్లో చేసినట్లు ఇక్కడ నడవదని కేసీఆర్ అన్నారు. శివసేనను టార్గెట్ చేసినట్లు టీఆర్ఎస్ ను లక్ష్యంగా చేయాలని చూస్తున్నారని ఆయన అన్నారు. అయినా ఇక్కడ అవేమీ చెల్లదన్నారు. మునుగోడులో టీఆర్ఎస్ దే గెలుపని అన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో ఎమ్మెల్యేలను ఇన్ ఛార్జులుగా నియమిస్తానని చెప్పారు. ఒక్కొక్క ఎమ్మెల్యేకు రెండు గ్రామాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఎవరికీ భయపడాల్సిన పనిలేదని, ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకం ఉన్నంత కాలం మనకు తిరుగుండదని చెప్పారు. అయినా మునుగోడు ఉప ఎన్నికను సీరియస్ గా తీసుకుని అత్యధిక మెజారిటీ సాధించేందుకు ప్రయత్నించాలన్నారు.