ఎస్టీలకు త్వరలోనే 10 శాతం రిజర్వేషన్లు

గిరిజనులకు త్వరలో పది శాతం రిజర్వేషన్ అమలు జరిగేలా జీవో విడుదల చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు

Update: 2022-09-17 12:24 GMT

గిరిజనులకు త్వరలో పది శాతం రిజర్వేషన్ అమలు జరిగేలా జీవో విడుదల చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. వారం రోజుల్లో జీవోను విడుదల చేస్తామని తెలిపారు. ఆరు శాతం నుంచి పది శాతానికి పెంచుతూ ఉత్తర్వుల జారీ చేస్తామన్నారు. ఆ జీవోను రాష్ట్రపతి ఆమోదం పొందేలా రాష్ట్రపతికి పంపాలని ఆయన కోరారు. మోదీ దానిని అమలు చేస్తారా? లేదా దానిని ఉరితాడు చేసుకుంటారా? అన్నది ఆలోచించుకోవాలన్నారు. ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన ఆదివాసీ, గిరిజనుల ఆత్మీయ సభలో కేసీఆర్ మాట్లాడారు.

గిరిజన బంధు పథకాన్ని...
త్వరలో గిరిజన బంధు పథకాన్ని ప్రారంభిస్తామని కూడా కేసీఆర్ ఈ సందర్భంగా ప్రకటించారు. పోడు రైతులకు భూములను ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. గిరిజన తండాల్లోనూ మిషన్ భగీరధ కింద మంచినీరు అందుతుందని తెలిపారు. తెలగాణ పథకాలు దేశ వ్యాప్తంగా అమలు కావాలని కేసీఆర్ ఆకాంక్షించారు. గిరిజనులను తమ ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటుందని ఆయన తెలిపారు.


Tags:    

Similar News