Telangana : నో వ్యాక్సిన్… నో రేషన్.. నో పెన్షన్
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతుంది. వ్యాక్సిన్ తీసుకోకుంటే లబ్దిదారులకు ప్రభుత్వ ప్రయోజనాల్లో కోత విధించేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ఈ మేరకు [more]
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతుంది. వ్యాక్సిన్ తీసుకోకుంటే లబ్దిదారులకు ప్రభుత్వ ప్రయోజనాల్లో కోత విధించేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ఈ మేరకు [more]
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతుంది. వ్యాక్సిన్ తీసుకోకుంటే లబ్దిదారులకు ప్రభుత్వ ప్రయోజనాల్లో కోత విధించేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదన పంపినట్లు సమాచారం. తెలంగాణలో తక్కువ మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు. కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టడంతో వ్యాక్సిన్ వేయించుకోవడానికి వెనుకాడుతున్నారు.
నవంబరు 1 నుంచి….
ప్రభుత్వం ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వ్యాక్సిన్ నిల్వలను కూడా పెంచింది. అయితే ప్రజలు ముందుకు రాకపోవడంతో వ్యాక్సిన్ వేయించుకోని వారికి రేషన్, పెన్షన్ కట్ చేయాలని నిర్ణయించారని తెలిసింది. తెలంగాణలో ప్రతి నెల 92 లక్షల మంది రేషన్ తీసుకుంటున్నారు. అలాగే వృద్ధులు, వికలాంగులు, వితంతువులు 36 లక్షల మంది పెన్షన్ పొందుతున్నారు. వ్యాక్సిన్ వేయించుకోకుంటే వీరికి రేషన్, పెన్షన్ నిలిపేయాలని వైద్య ఆరోగ్యశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదన పంపింది. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. నవంబరు 1 నుంచి దీనిని అమలు చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది.