కోర్టుల్లో అన్ లాక్ ప్రక్రియ ప్రారంభం

కోర్టుల్లో అన్ లాక్ ప్రారంభించాలని తెలంగాణ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. సిబ్బంది అందరూ విధులకు హాజరు కావాలని హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది. ఇప్పటి వరకు రోజు విడిచి [more]

Update: 2021-07-13 12:02 GMT

కోర్టుల్లో అన్ లాక్ ప్రారంభించాలని తెలంగాణ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. సిబ్బంది అందరూ విధులకు హాజరు కావాలని హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది. ఇప్పటి వరకు రోజు విడిచి రోజు మాత్రమే సిబ్బంది హాజరవుతున్నారు. రోజుకు సగం మంది సిబ్బంది మాత్రమే వస్తున్నారు. ఈనెల 19 నుంచి కోర్టుల్లో పాక్షికంగా ప్రత్యక్ష విచారణ ప్రారంభించాలని హైకోర్టు నిర్ణయం తీసుకుంది. ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలు మినహా రాష్ట్రంలో పాక్షిక ప్రత్యక్ష విచారణ చేయాలని హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది. ఆదిలాబాద్, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల్లోఈనెల 31 వరకు ఆన్ లైన్ విచారణ చేపట్టాలని హైకోర్టు నిర్ణయించింది.
హైకోర్టులో ఈనెల 31 వరకు ఆన్ లైన్ విచారణ విధానం కొనసాగనుంది.

Tags:    

Similar News