ఆ జీవో ఇప్పటి అవసరాలకు పనికిరాదు

ప్రవేటు హాస్పిట‌ల్స్‌లో వ‌సూలు చేసే ధ‌ర‌ల‌ను ప్రభుత్వం నిర్ణయించాలని తెలంగాణ హైకోర్టు అభిప్రాయపడింది. సిటీ స్కాన్‌, ఆక్సీజ‌న్ బెడ్స్‌, లైఫ్ సేవింగ్ డ్రగ్స్ ధ‌ర‌లు నిర్ణయిస్తూ జీవో [more]

Update: 2021-05-06 01:02 GMT

ప్రవేటు హాస్పిట‌ల్స్‌లో వ‌సూలు చేసే ధ‌ర‌ల‌ను ప్రభుత్వం నిర్ణయించాలని తెలంగాణ హైకోర్టు అభిప్రాయపడింది. సిటీ స్కాన్‌, ఆక్సీజ‌న్ బెడ్స్‌, లైఫ్ సేవింగ్ డ్రగ్స్ ధ‌ర‌లు నిర్ణయిస్తూ జీవో జారీచేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. గ‌త ఏడాది ఇచ్చిన జీవో ఇప్పటి అవ‌స‌రాల‌కు ప‌నికి రాదని హైకోర్టు అభిప్రాయపడింది. ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిట‌ల్స్‌లో ఏర‌కం బెడ్స్ ఎన్ని ఖాళీగా ఉన్నాయో రియ‌ల్ టైం వివ‌రాలు ప్రభుత్వ వెబ్‌సైట్‌లో ప్రజ‌ల‌కు అందుబాటులో ఉంచాలని హైకోర్టు ఆదేశించింది. ఆర్టీపీసీఆర్ టెస్ట్‌ల ఫ‌లితాలు 24 గంట‌ల్లో వ‌చ్చేలా చ‌ర్యలు తీసుకోవాలని హైకోర్టు కోరింది. వివాహాలు, ఇత‌ర స‌మావేశాల వ‌ద్ద కోవిడ్ 19 నిబంధ‌న‌ల అమ‌లుపై రెవెన్యూ, పోలీస్‌, మున్సిప‌ల్ అధికారుల‌తో స్థానికంగా క‌మిటీలు వేసి త‌నిఖీలు చేప‌ట్టాలని హైకోర్టు సూచించింది.

Tags:    

Similar News