కేఆర్ఎంబీ నుంచి తెలంగాణ వాకౌట్

కేఆర్ఎంబీ సమావేశం నుంచి తెలంగాణ అధికారులు వాకౌట్ చేశారు. ప్రాజెక్టుల్లో విద్యుత్ ఉత్పత్తి పై ఇరు రాష్ట్రాల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. శ్రీశైలం ప్రాజెక్టులో విద్యుత్తు ఉత్పత్తి [more]

Update: 2021-09-01 12:51 GMT

కేఆర్ఎంబీ సమావేశం నుంచి తెలంగాణ అధికారులు వాకౌట్ చేశారు. ప్రాజెక్టుల్లో విద్యుత్ ఉత్పత్తి పై ఇరు రాష్ట్రాల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. శ్రీశైలం ప్రాజెక్టులో విద్యుత్తు ఉత్పత్తి నిలిపేయాలని ఇప్పటికే ఏపీ అధికారులు కేఆర్ఎంబీకి లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ నేేపథ్యంలో ఈరోజు జరిగిన సమావేశంలో ఏపీ అధికారులు ఈ విషయాన్ని మరోసారి ప్రస్తావించారు. కేఆర్ఎంబీ అధికారులు కూడా తమ అనుమతి లేకుండా విద్యుత్తు ఉత్పత్పి చేయకూడదని చెప్పారు. దీంతో ఐదు గంటల పాటు సాగిన ఈ సమావేశం నుంచి తెలంగాణ అధికారులు వాకౌట్ చేశారు. కాసేపట్లో జరగనున్న గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమావేశాన్ని కూడా తెలంగాణ బహిష్కరించాలని నిర్ణయించినట్లు తెలిసింది.

Tags:    

Similar News