తెలంగాణ‌లో సీన్ రిపీట్ అవుతుదంట‌..!

అసెంబ్లీ ఎన్నిక‌ల్లో విజ‌యంతో జోష్ లో ఉన్న టీఆర్ఎస్ పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లోనూ స‌త్తా చాటుతుంద‌ని వీడీపీ అసోసియేట్స్ స‌ర్వే అంచ‌నా వేసింది. పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో ఇప్ప‌డున్న ప‌రిస్థితిని [more]

Update: 2019-02-07 08:46 GMT

అసెంబ్లీ ఎన్నిక‌ల్లో విజ‌యంతో జోష్ లో ఉన్న టీఆర్ఎస్ పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లోనూ స‌త్తా చాటుతుంద‌ని వీడీపీ అసోసియేట్స్ స‌ర్వే అంచ‌నా వేసింది. పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో ఇప్ప‌డున్న ప‌రిస్థితిని బ‌ట్టి చూస్తే టీఆర్ఎస్ 14 స్థానాల్లో విజ‌యం సాధిస్తుంద‌ని ఈ స‌ర్వే అంచ‌నా వేసింది. ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్ పార్టీ కేవ‌లం 2 స్థానాల‌కే ప‌రిమితం అవుతుంద‌ని తేలింది. హైద‌రాబాద్ స్థానాన్ని ఎంఐఎం గెలుచుకుంటుంద‌ని, అదే స‌మ‌యంలో సికింద్రాబాద్ స్థానాన్ని బీజేపీ కోల్పోతుంద‌ని స‌ర్వే స్ప‌ష్టం చేసింది. అయితే, ఓట్ల శాతంలో మాత్రం అసెంబ్లీ ఎన్నిక‌ల కంటే కాంగ్రెస్ కొంత మెరుగ‌వుతుంద‌ని అంచ‌నా వేసింది. టీఆర్ఎస్ కి 42.85 శాతం, కాంగ్రెస్ కి 34.2 శాతం, బీజేపీకి 12.10 శాతం, ఎంఐఎంకు 4.0 శాతం, ఇత‌రుల‌కు 6.85 ఓట్లు వ‌స్తాయ‌ని స‌ర్వేలో తేలింది.

 

Tags:    

Similar News