యాదాద్రిలో కేసీఆర్ బొమ్మలేంది

తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రి దేవాలయంలో నూతనంగా నిర్మిస్తున్న రాతి స్తంభాలపై కేసీఆర్ బొమ్మలు, ప్రభుత్వ పథకాలు చెక్కించారని దీనిపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర అభ్యంతరం [more]

Update: 2019-09-06 13:24 GMT

తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రి దేవాలయంలో నూతనంగా నిర్మిస్తున్న రాతి స్తంభాలపై కేసీఆర్ బొమ్మలు, ప్రభుత్వ పథకాలు చెక్కించారని దీనిపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దేవాలయాన్ని అభివృద్ధి పరచడం కర్తవ్యం మాత్రమేనని, బొమ్మలు చెక్కించడం సముచితం కాదని ఓ వీడియోను రాజాసింగ్ ట్విట్టర్ లో పాస్టు చేశారు. యాదాద్రి ఆలయ అభివృద్ధి కేసీఆర్ సొంత సొమ్ముతో చేయించడం
లేదన్నారు. బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వాటిని తొలగించకపోతే తామే ప్రజలతో కలిసి వచ్చి తొలగిస్తామని హెచ్చరించారు.

కేసీఆర్ క్షమాపణలు చెప్పాలి – లక్ష్మణ్

మరోవైపు రాజాసింగ్ పోస్టింగ్ పై తెలంగాణ బీజేపీ అధ్యక్షులు లక్ష్మణ్ సైతం అభ్యంతరం వ్యక్తం చేశారు. లక్ష్మినర్సింహాస్వామి ఆలయ అష్టబుజి ప్రాకార మండపంలోని రాతి స్తంభాలపై సీఎం కేసీఆర్ చిత్రాలు చెక్కించడాన్ని తీవ్రంగా ఖండించారు. దీనివల్ల పుణ్యక్షేత్ర ప్రాశస్త్యాన్ని భంగపర్చడమవుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ హిందూ సమాజానికి బేషరుతుగా క్షమాపణలు చెప్పాలని లక్ష్మణ్ డిమాండ్ చేశారు.

Tags:    

Similar News