బ్రేకింగ్ : కారు స్పీడ్ ను ఆపలేకపోతున్నారు

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కారు స్పీడ్ మామూలుగా లేదు. పట్టణ ఓటర్లందరూ దాదాపు టీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా నిలిచినట్లు ఎన్నికల ఫలితాలను బట్టి చూస్తే తెలుస్తోంది. మొత్తం [more]

Update: 2020-01-25 04:54 GMT

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కారు స్పీడ్ మామూలుగా లేదు. పట్టణ ఓటర్లందరూ దాదాపు టీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా నిలిచినట్లు ఎన్నికల ఫలితాలను బట్టి చూస్తే తెలుస్తోంది. మొత్తం 120 స్థానాల్లో 44 మున్సిపాలిటీలలో టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉంది. తొమ్మిది కార్పరేషన్లలో జవహర్ నగర్, మీర్ పేట్ కార్పొరేషన్లలో గులాబీ జెండా ఎగిరింది. నిజమాబాద్ లోని భీంగల్ మున్సిపాలిటీని టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఇప్పటి వరకూ తొమ్మిది మున్సిపాలిటీలను టీఆర్ఎస్ గెలుచుకుంది. ఎంఐఎం ఒకటి గెలుచుకుంది. ధర్మపురి మున్సిపాలిటీ టీఆర్ఎస్ పరమయింది. బాన్సువాడ మున్సిపాలిటీ కూడా టీఆర్ఎస్ చేతికే వచ్చింది. మొత్తం మీద తెలంగాణలో పట్టణ ఓటర్లు టీఆర్ఎస్ కే పట్టం కట్టినట్లు ఇప్పటి వరకూ వెల్లడయిన ఫలితాలను బట్టి తెలుస్తోంది. కాంగ్రెస్, బీజేపీ చెరొక మున్సిపాలిటీని గెలుచుకున్నాయి.

Tags:    

Similar News