శాసనమండలిలో కాంగ్రెస్ ను విలీనంచేయడానికి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం శాసనమండలి పక్ష నేతగా షబ్బీర్ ఆలి, ఉప నేతగా పొంగులేటి సుధాకర్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ ఎమ్మెల్సీలు దామోదర్ రెడ్డి, ప్రభాకర్ లు టీఆర్ఎస్ లో చేరిపోయారు. నిన్న ప్రగతి భవన్ లో కాంగ్రెస్ ఎమ్మెల్సీలు ఆకుల లలిత, సంతోష్ కుమార్ లు కేసీఆర్ ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. వీరునలుగురు కలసి మండలిలో కాంగ్రెస్ ను టీఆర్ఎస్ లో విలీనం చేయాలని లేఖ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వీరు శాసనమండలి ఛైర్మన్ స్వామిగౌడ్ ను కలసి శారు. కాంగ్రెస్ సభాపక్షాన్ని టీఆర్ఎస్ లో విలీనం చేయాలని వీరు కోరుతున్నారు. శాసనమండలిలో ఇక విపక్షం అనేది ఉండదని తేలిపోయింది.