నేటి నుంచి రేవంత్ పాదయాత్ర

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నేటి నుంచి పాదయాత్ర ప్రారంభించనున్నారు.

Update: 2023-02-06 02:15 GMT

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నేటి నుంచి పాదయాత్ర ప్రారంభించనున్నారు. హాత్ సే హాత్ జోడో కార్యక్రమంలో భాగంగా ఆయన ములుగు నియోజకవర్గం నుంచి పాదయాత్ర చేపట్టనున్నారు. సమ్మక్క సారలమ్మలకు ప్రత్యేక పూజలు చేసి రేవంత్ రెడ్డి తన పాదయాత్రను ప్రారంభించనున్నారు. మేడారం నుంచి ప్రారంభమవుతున్న పాదయాత్ర ప్రారంభానికి భారీ ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు చేరుకోనున్నాయి.

అరవై రోజులు...
రేవంత్ రెడ్డి మొత్తం రెండు నెలల పాటు పాదయాత్ర చేయనున్నారు. యాభై అసెంబ్లీ నియోజకవర్గాలను టచ్ చేస్తూ ఈ పాదయాత్ర వెళ్లనుంది. ప్రజాసమస్యలను తెలుసుకుంటూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగడుతూ ఈ యాత్రను రేవంత్ రెడ్డి కొనసాగించనున్నారు. ఉదయం 11 గంటలకుక మేడారంలోని సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద పూజలు నిర్వహించిన అనంతరం పన్నెండు గంటలకు పాదయాత్ర ప్రారంభమవుతుంది.
ఈరోజు ఇలా...
తొలి రోజు మేడారం నుంచి బయలుదేరి కొత్తూరు, నార్లాపూర్, ప్రాజెక్ట్ నగర్ వరకూ యాత్రను కొనసాగిస్తారు. ప్రాజెక్టు నగర్ లో భోజన విరామానికి ఆగుతారు. అనంతరం 4.30 గంటలకుద యాత్ర ప్రారంభమై పస్రా కూడలిలో సమావేశం నిర్వహిస్తారు. రాత్రి ఎనిమిది గంటలకు రామప్ప గ్రామం చేరుకుంటారు. రాత్రికి రేవంత్ రెడ్డి అక్కడే బస చేస్తారు. రేవంత్ రెడ్డి పాదయాత్రను విజయవంతం చేసేలా కాంగ్రెస్ పార్టీ నేతలు అన్ని చర్యలు తీసుకున్నారు.


Tags:    

Similar News