పొత్తులపై చంద్రబాబు కీ కామెంట్స్

తెలుగుదేశం పార్టీ అధినేత కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక ఇంటర్యూలో ఆయన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

Update: 2022-06-01 02:48 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత కీలక వ్యాఖ్యలు చేశారు. తన తదనంతరం పార్టీ పగ్గాలు స్వీకరించే బాధ్యత కేవలం లోకేష్ కు మాత్రమే లేదని, పార్టీలోని యువనేతలందరీకి ఉందని ఆయన వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ది ప్రింట్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో చంద్రబాబు ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ పగ్గాలు తన తదనంతరం లోకేష్ తో పాటుగా సమర్థవంతమైన యువనేతలు ఎవరైనా చేపట్టే అవకాశముందని ఆయన తెలిపారు. పార్టీ పగ్గాలు స్వీకరించేందుకు లోకేష్ ఒక్కరే అర్హులు కాదని, పార్టీలోని యువనేతలందరూ అర్హులేనని చంద్రబాబు ఈ ఇంటర్వ్యూలో తెలిపారు.

ఎన్నికల సమయంలోనే....
ప్రజాసమస్యలపై, క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితులపై రానురాను నేతల్లో అవగాహన కొరవడుతుందని, అటువంటి సత్తా తరం మారుతున్న కొద్దీ తగ్గిపోతుందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఇక పొత్తుల విషయంపై కూడా చంద్రబాబు ఈ ఇంటర్వ్యూలో స్పందించారు. ఎన్నికల సమయంలోనే పొత్తుల నిర్ణయం ఉంటుందని చంద్రబాబు తెలిపారు. ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలన్నది దిగువ స్థాయి నేతల నుంచి నిర్ణయం జరుగుతుందని ఆయన చెప్పారు. పొత్తుల అంశంపై చర్చించడానికి ఇంకా చాలా సమయం ఉందని చంద్రబాబు చెప్పారు. 2024 లో అధికారం తెలుగుదేశం పార్టీదే నని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.
వ్యతిరేకత తీవ్రంగా....
ప్రభుత్వంపై వ్యతరేకత తీవ్రంగా ఉందని, ఏ వర్గం ప్రజలు ఈ ప్రభుత్వం ఎక్కువ కాలం కొనసాగడానికి కూడా ఇష్టపడటం లేదని చంద్రబాబు అన్నారు. గతంలో ఏ ప్రభుత్వం మూడేళ్లలో ఇంత వ్యతిరేతకను ప్రజల నుంచి ఎదుర్కొనలేదని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. తమదే గెలుపు అని, ప్రజలు అభివృద్ధి వైపే మొగ్గుచూపుతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇందుకు మహానాడుకు తరలి వచ్చిన జనసందోహమే కారణమని చంద్రబాబు తెలిపారు.


Tags:    

Similar News