బాబు రివ్యూ థెరపీ... అందుకేనట
తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం నైరాశ్యంలో ఉంది. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఫ్రస్టేషన్ లో ఉన్నారు.
తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం నైరాశ్యంలో ఉంది. చంద్రబాబు కూడా ఫ్రస్టేషన్ లో ఉన్నారు. గత రెెండున్నరేళ్లలో ఎప్పుడూ లేని అసహనం చంద్రబాబులో తరచూ కన్పిస్తుంది. అది అక్కసు అనుకోవాలా? లేదా అసహనం అనుకోవాలో? తెలియదు కాని చంద్రబాబు మాత్రం జగన్ ప్రభుత్వం ఒక్క క్షణం కూడా ఉండటానికి వీల్లేదంటున్నారు. కానీ అది సాధ్యం కాదు. ముఖ్యంగా నెల రోజుల నుంచి చంద్రబాబు లో ఈ ఫ‌్రస్టేషన్ మరింత కనిపిస్తుంది.
ఓటమిని....
ఏ పార్టీకైనా ఓటమి సహజం. గెలుపోటములు రాజకీయాల్లో మామూలే. అయితే విభజన ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు తన ఓటమిని ఒప్పుకోవడం లేదు. తానే విభజిత ఆంధ్రప్రదేశ్ కు శాశ్వత సీఎంగా చంద్రబాబు ఊహించుకున్నారు. జగన్ ను ఎవరూ పట్టించుకోరన్న ధీమాగా ఉన్నారు. కానీ బాబు క్యాలిక్యులేషన్ రాంగ్ అయింది. పార్టీ ఢమాల్ అయింది. జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచే ఓటు బ్యాంకు ను మరింత పటిష్టం చేసుకునే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. చంద్రబాబుకు ఇది రుచించడం లేదు.
నిస్సహాయతతోనే...
ఏమీ చేయలేని నిస్సహాయత చంద్రబాబులో ఫ్రస్టేషన్ ను మరింత పెంచుతుంది. ఇటీవల కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ ఓటమిని చంద్రబాబు డైజెస్ట్ చేసుకోలేకపోయారు. నిన్న టివరకూ దానిపై పోస్ట్ మార్టం చేస్తూనే ఉన్నారు. అక్కడకు వెళ్లి వచ్చిన నేతల చేత నివేదిక తెప్పించుకున్నారు. టీడీపీలోని కొందరి నేతల కారణంగానే అక్కడ ఓటమి పాలయ్యామని తేలింది. కుప్పం వంటి చోటే ఎదురుదెబ్బ తగిలితే మిగిలిన చోట పరిస్థితి ఏంటన్నది చంద్రబాబుకు అర్థం కాకుండా ఉంది.
రివ్యూ థెరపీ...
జగన్ వ్యూహాలను సయితం జీర్ణించుకోలేెక పోతున్నారు. వచ్చే ఎన్నికల నాటికి కుప్పం మరింత సమస్యగా మారే అవకాశముంది. మరోవైపు లోకేష్ కూడా రాజకీయంగా ఎదగడం లేదు. సీనియర్లు ఎందుకూ పనికి రాకుండా పోయారు. వారి వారసులు సయితం రాజకీయంగా ఎక్కి వచ్చేట్లు లేరు. ఇవన్నీ వెరసి చంద్రబాబులో అసహనాన్ని మరింత పెంచుతున్నాయంటున్నారు. అందుకే రోజూ సమీక్ష పేరిట కాలక్షేపం చేస్తూ రివ్యూ థెరపీ చేస్తున్నారు. మొన్నటి మున్సిపల్ ఎన్నికల్లో ఓడిపోయిన దాచేపల్లి, గురజాల, గెలిచిన కొండపల్లిపై కూడా చంద్రబాబు రివ్యూ చేశారు. రివ్యూల ద్వారా కొంత ఫ్రస్టేషన్ ను చంద్రబాబు నియంత్రించుకుంటున్నారు.