కెనెడాలో ఎమ్మెల్యేలుగా తెలుగువారు.. చంద్రబాబు అభినందనలు
విదేశాల్లోనూ తెలుగు ప్రజలు రాజకీయంగా ఉన్నత స్థానాలకు ఎదుగుతున్నారు. ఇప్పటికే పలు దేశాల చట్టసభల్లో తెలుగువారు ప్రాతినిథ్యం వహిస్తుండగా తాజాగా కెనెడాలోనూ ఇద్దరు తెలుగు వారు అసెంబ్లీకి [more]
విదేశాల్లోనూ తెలుగు ప్రజలు రాజకీయంగా ఉన్నత స్థానాలకు ఎదుగుతున్నారు. ఇప్పటికే పలు దేశాల చట్టసభల్లో తెలుగువారు ప్రాతినిథ్యం వహిస్తుండగా తాజాగా కెనెడాలోనూ ఇద్దరు తెలుగు వారు అసెంబ్లీకి [more]
విదేశాల్లోనూ తెలుగు ప్రజలు రాజకీయంగా ఉన్నత స్థానాలకు ఎదుగుతున్నారు. ఇప్పటికే పలు దేశాల చట్టసభల్లో తెలుగువారు ప్రాతినిథ్యం వహిస్తుండగా తాజాగా కెనెడాలోనూ ఇద్దరు తెలుగు వారు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. కెనడాలోని అల్బెర్టా రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో భారత సంతతికి చెందిన ఇద్దరు తెలుగువారు విజయం సాధించారు. గుంటూరు జిల్లాకు చెందిన ప్రసాద్ పాండా, విజయనగరం జిల్లాకు చెందిన లీల అహీర్ యునైటెడ్ కన్జర్వేటీవ్ పార్టీ(యూసీపీ) తరపున అల్బెర్టా రాష్ట్ర అసెంబ్లీ సభ్యులుగా విజయం సాధించారు. వీరిద్దరి పూర్వికులు అనేక ఏళ్ల క్రితం కెనెడా వెళ్లి స్థిరపడ్డారు. వీరిద్దరికీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలియజేశారు.