వైసీపీ అల్లర్లు సృష్టించే అవకాశం

కౌంటింగ్ రోజు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అల్లర్లు సృష్టించే అవకాశం ఉందని, కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలని తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యులు [more]

Update: 2019-05-20 11:54 GMT

కౌంటింగ్ రోజు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అల్లర్లు సృష్టించే అవకాశం ఉందని, కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలని తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యులు కనకమేడల రవింద్రకుమార్ కోరారు. ఈ మేరకు ఢిల్లీలో ఆయన కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి వినతిపత్రం సమర్పించారు. ఓట్ల లెక్కింపును పారదర్శకంగా జరిపించాలని, రిటర్నింగ్ అధికారులు ఇచ్చిన ఫామ్ 17 ఏను సరిపోల్చుకొని కౌంటింగ్ జరిపేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. పోలింగ్ ఏజెంట్లు ఎలాంటి పత్రాలను తీసుకొని రావొద్దని రిటర్నింగ్ అధికారులు చెప్పడం సరికాదని అన్నారు. వీవీ ప్యాట్ల లెక్కింపు ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నందున కౌంటింగ్ ఏజెంట్ల బయటకు వెళ్లకుండా భోజన సధుపాయం ఏర్పాటు చేయాలని కోరారు.

Tags:    

Similar News