గల్లా ఏమైనా స్వాతంత్ర్య సమరయోధుడా?

ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం ముగిసింది. అయితే ఈ సమావేశంలో ఏపీ అంశాలు హాట్ టాపిక్ గా మారాయి. ఏపీ శాసనమండలి రద్దు, రాజధాని మార్పు అంశాలను పార్లమెంటులో [more]

Update: 2020-01-30 11:22 GMT

ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం ముగిసింది. అయితే ఈ సమావేశంలో ఏపీ అంశాలు హాట్ టాపిక్ గా మారాయి. ఏపీ శాసనమండలి రద్దు, రాజధాని మార్పు అంశాలను పార్లమెంటులో చర్చించాలని పట్టుబట్టారు. ఎంపీ గల్లా జయదేవ్ తనపై పోలీసులు దాడి చేసిన విషయాన్ని కూడా ప్రస్తావించారు. అయితే ఇందుకు విజయసాయిరెడ్డి గల్లా జయదేవ్ స్వాతంత్ర సమరయోధుడు ఏమీ కాదని ఎద్దేవా చేశారు. అంతేకాదు రాజధాని మార్పు రాష్ట్రాలకు సంబంధించిన అంశమని దానిపై పార్లమెంటులో చర్చ ఏమిటని మిధున్ రెడ్డి ప్రశ్నించారు. దీంతో ఇరుపార్టీల నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అయితే రాజ్ నాథ్ సింగ్ జోక్యం చేసుకుని ఇరు పార్టీల నేతలకు సర్ది చెప్పారు.

Tags:    

Similar News