టీడీపీ అడ్డుకుంటుందా?

మూడు రాజధానుల అంశం శాసనమండలి ఎదుటకు మరికొద్దిసేపట్లో రానుంది. నిన్న శాసనసభలో ఆమోదం పొందిన ఈ బిల్లు శాసనమండలిలో అడ్డుకునేందుకు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ప్రయత్నిస్తుంది. శాసనమండలిలో [more]

Update: 2020-01-21 03:39 GMT

మూడు రాజధానుల అంశం శాసనమండలి ఎదుటకు మరికొద్దిసేపట్లో రానుంది. నిన్న శాసనసభలో ఆమోదం పొందిన ఈ బిల్లు శాసనమండలిలో అడ్డుకునేందుకు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ప్రయత్నిస్తుంది. శాసనమండలిలో టీడీపీకి బలం ఉన్నందున అడ్డుకుని తీరుతామని చెబుతోంది. మూడు రాజధానులు, సీఆర్డీఏ చట్లం రద్దు బిల్లులు శాసనమండలి ఎదుటకు రానున్నాయి. అయితే శాసనమండలిలో బిల్లులను ఆమోదింపచేసేకునేందుకు ప్రభుత్వం గట్టిగా ప్రయత్నిస్తుంది. పెద్ద సంఖ్యలో మంత్రులు శాసనమండలి కి హాజరుకానున్నారు. మండలిలో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. సాధారణ ప్రక్రియలో అయితే ఈ బిల్లు శాసనమండలిలో ఆమోదం పొందే అవకాశం లేదు. శాసనమండలిలో ఆమోదం పొందకపోతే ఆర్డినెన్స్ తేవాలని ప్రభుత్వం వ్యూహరచన చేస్తుంది.

Tags:    

Similar News