తాడిపత్రి కూడా తేడా కొట్టేటట్లుందే?
తాడిపత్రి మున్సిపాలిటిలో టీడీపీ ఏకైక పెద్ద పార్టీగా విజయం సాధించింది. అయితే మున్సిపల్ ఛైర్మన్ విషయంలో టీడీపీకి దెబ్బపడే అవకాశాలున్నాయి. తాడిపత్రిలో మొత్తం 36 వార్డులున్నాయి. ఇందులో [more]
తాడిపత్రి మున్సిపాలిటిలో టీడీపీ ఏకైక పెద్ద పార్టీగా విజయం సాధించింది. అయితే మున్సిపల్ ఛైర్మన్ విషయంలో టీడీపీకి దెబ్బపడే అవకాశాలున్నాయి. తాడిపత్రిలో మొత్తం 36 వార్డులున్నాయి. ఇందులో [more]
తాడిపత్రి మున్సిపాలిటిలో టీడీపీ ఏకైక పెద్ద పార్టీగా విజయం సాధించింది. అయితే మున్సిపల్ ఛైర్మన్ విషయంలో టీడీపీకి దెబ్బపడే అవకాశాలున్నాయి. తాడిపత్రిలో మొత్తం 36 వార్డులున్నాయి. ఇందులో 18 వార్డుల్లో టీడీపీ విజయం సాధించింది. 16వ వార్డుల్లో వైైసీపీ గెలిచింది. వైసీపీకి ఎమ్మెల్యే, ఎంపీ ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఉన్నారు. దీంతో ఇద్దరికీ సమానమైన ఓట్లు ఛైర్మన్ ఎంపికలో ఉన్నాయి. అయితే ఇక్కడ ఒక స్థానంలో సీపీఐ, మరో స్థానంలో ఇండిపెండెంట్ అభ్యర్థి గెలిచారు. వీరిద్దరూ తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికలో కీలకంగా మారనున్నారు. అయితే ఈ ఇద్దరిని జేసీ ప్రభాకర్ రెడ్డి క్యాంప్ నకు తరలించారని తెలుస్తోంది.