ముందు జీవీఎల్.. ఆ తర్వాత టీడీపీ నేతలు
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను తెలుగుదేశం పార్టీ నేతలు కలిశారు. రెండు రోజుల క్రితం విశాఖపట్నంలో చంద్రబాబు ను ఎయిర్ పోర్టులో అడ్డుకున్న సంఘటనపై గవర్నర్ [more]
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను తెలుగుదేశం పార్టీ నేతలు కలిశారు. రెండు రోజుల క్రితం విశాఖపట్నంలో చంద్రబాబు ను ఎయిర్ పోర్టులో అడ్డుకున్న సంఘటనపై గవర్నర్ [more]
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను తెలుగుదేశం పార్టీ నేతలు కలిశారు. రెండు రోజుల క్రితం విశాఖపట్నంలో చంద్రబాబు ను ఎయిర్ పోర్టులో అడ్డుకున్న సంఘటనపై గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. పోలీసులు వైసీపీ కార్యకర్తల అండగా నిలుస్తున్నారని, రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని గవర్నర్ కు తెలిపారు. ఎక్కడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేయకుండా అడ్డుకుంటున్నారని, శాంతియుతంగా ఆందోళనలకు కూడా అనుమతి ఇవ్వడం లేదని తెలిపారు. చంద్రబాబు పర్యటనకు పోలీసులు అనుమతి ఇచ్చిన తర్వాత కూడా అడ్డుకున్నారని తెలిపారు. అయితే టీడీపీ నేతలు గవర్నర్ ను కలిసే ముందు బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు కలిశారు. గవర్నర్ తో జీవీఎల్ అరగంట పాటు భేటీ అయ్యారు. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై చర్చించినట్లు జీవీఎల్ తెలిపారు.