బ్రేకింగ్ : రాప్తాడులో రాళ్లదాడులు…!!!
ప్రధానంగా రాయలసీమ, పల్నాడులో ఎక్కువగా ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నికల సందర్భంగా పోలీసు బందోబస్తు భారీగానే ఏర్పాటు చేసినప్పటీకి ఘర్షణలను నివారించలేకపోతున్నారు. పలు చోట్ల పార్టీ కార్యకర్తలు [more]

ప్రధానంగా రాయలసీమ, పల్నాడులో ఎక్కువగా ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నికల సందర్భంగా పోలీసు బందోబస్తు భారీగానే ఏర్పాటు చేసినప్పటీకి ఘర్షణలను నివారించలేకపోతున్నారు. పలు చోట్ల పార్టీ కార్యకర్తలు తమ ప్రతాపాన్ని ఈవీఎంలపై చూపుతున్నారు. పరిటాల సునీత కుమారుడు శ్రీరామ్ పోటీ చేసే రాప్తాడు నియోజకవర్గంలోనూ పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. రాప్తాడు నియోజకవర్గంలోని సనప పోలింగ్ కేంద్రంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈవీఎంలను ధ్వంసం చేయడంతో అక్కడ పోలింగ్ నిలిచిపోయింది. ఈ సందర్భంగా పరిటాల వర్గీయులకు, వైసీపీ కార్యకర్తలకు మధ్య ఘర్షణ జరిగింది. పరస్పరం రాళ్ళురువుకున్నారు. ఈ సంఘటన సిద్ధరాంపురంలో జరిగింది.