తాడిపత్రి..అట్టుడికి పోతుందే….!!

తాడిపత్రి ఈ ఎన్నికల్లో రణరంగంగా మారింది. తాడిపత్రిలో తెలుగుదేశం పార్టీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల మధ్య పోరు హోరాహోరీగా కొనసాగింది. ఇక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న [more]

Update: 2019-04-11 09:41 GMT

తాడిపత్రి ఈ ఎన్నికల్లో రణరంగంగా మారింది. తాడిపత్రిలో తెలుగుదేశం పార్టీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల మధ్య పోరు హోరాహోరీగా కొనసాగింది. ఇక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న టెన్షన్ సర్వత్రా నెలకొంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణలో తెలుగుదేశం పార్టీ కార్యకర్త మృతి చెందడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. మరోవైపు జేసీ ప్రభాకర్ రెడ్డి పోలీసు స్టేషన్లో ధర్నాకు దిగారు. వైసీపీ కార్యకర్తలు హింసాత్మక చర్యలకు పాల్పడుతున్నారని జేసీ ప్రభాకర్ రెడ్డి పోలీస్ స్టేషన్లో హల్ చల్ చేశారు.

ఒకరు మృతి చెందడంతో…..

నిజానికి తాడిపత్రి నియోజకవర్గం జేసీ దివాకర్ రెడ్డి కుటుంబానికి కంచుకోట. ఇక్కడ ఈసారి జేసీ ప్రభాకర్ రెడ్డి తనయుడు అస్మిత్ రెడ్డి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరుపున కేతిరెడ్డి పెద్దారెడ్డి బరిలో నిలిచారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయిన నాటి నుంచే ఇక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ అధినేతజగన్మోహన్ రెడ్డి సభ తాడిపత్రిలో సక్సెస్ కావడంతో జేసీ కుటుంబంలో కొంత అలజడి బయలుదేరింది. మరోవైపు జేసీ అనుచరులను పోలింగ్ కేంద్రాల వద్ద ఎక్కడికక్కడ అడ్డుకోవడంతో ఘర్షణలు తలెత్తాయి. మొత్తం మీద తాడిపత్రిలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.

Tags:    

Similar News