అయ్యన్న అరెస్ట్..? ఇంటి గోడ కూల్చివేత

నర్సీపట్నంలో మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడి ఇంటి వద్ద టెన్షన్ వాతావారణం నెలకొంది. అయ్యన్న అరెస్ట్ కు రంగం సిద్ధం అయింది.

Update: 2022-06-19 02:27 GMT

నర్సీపట్నంలోని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడి ఇంటి వద్ద టెన్షన్ వాతావారణం నెలకొంది. అయ్యన్న అరెస్ట్ కు రంగం సిద్ధం అయింది. ఈరోజు తెల్లవారుజామున పెద్దయెత్తున పోలీసులు, మున్సిపల్ సిబ్బంది వచ్చారు. అయ్యన్న పాత్రుడి ఇంటి గోడను కూల్చారు. పంట కాల్వను ఆక్రమించి అయ్యన్నపాత్రుడు గోడ నిర్మించారని మున్సిపల్ అధికారులు పేర్కొన్నారు. ప్రభుత్వానికి చెందిన రెండు సెంట్ల భూమిని ఆక్రమించి అయ్యన్న గోడ కట్టారని, వాటిని తొలగిస్తున్నట్లు నోటీసులు జారీ చేశారు.

రెండు మార్గాలను మూసేసి..
అయితే ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు పెద్దయెత్తున అక్కడకు చేరుకుని పోలీసులు, మున్సిపల్ సిబ్బంది వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశాయి. అయితే టీడీపీ శ్రేణులను అయ్యన్న ఇంటి వైపునకు రాకుండా ఉన్న రెండు మార్గాలను మూసి వేశారు. కూల్చివేత పనులు కొనసాగుతున్నాయి. అయ్యన్న పాత్రుడిని అరెస్ట్ చేస్తారని ఆయన అనుచరులు పెద్దయెత్తున ఆందోళనకు దిగారు. పోలీసులు భారీ ఎత్తున మొహరించడంతో అయ్యన్న పాత్రుడిని మరికాసేపట్లో అరెస్ట్ చేస్తారని తెలుస్తోంది. ఇటీవల చోడవరం మహానాడులో అయ్యన్నపాత్రుడు ముఖ్యమంత్రి జగన్ పై అనుచిత వ్యాఖ్యలను చేసిన సంగతి తెలిసిందే.


Tags:    

Similar News