హైకోర్టులో కేంద్ర ప్రభుత్వం అఫడవిట్

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణపై కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో అఫడవిట్ దాఖలు చేసింది. ఆర్థిక వ్యవహారాలపై కేబినెట్ కమిటీ తీసుకున్న నిర్ణయం మేరకే స్టీల్ ప్లాంట్ [more]

Update: 2021-07-28 05:00 GMT

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణపై కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో అఫడవిట్ దాఖలు చేసింది. ఆర్థిక వ్యవహారాలపై కేబినెట్ కమిటీ తీసుకున్న నిర్ణయం మేరకే స్టీల్ ప్లాంట్ లో ప్రభుత్వ పెట్టుబడులు ఉపసంహరించాలని నిర్ణయించామని తెలిపింది. కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో పెట్టుబడులను ఉపసంహరించాలన్న నిర్ణయాన్ని జనవరి 27నే తీసుకున్నామని చెప్పారు. ఆర్థిక వ్యవహారాలపై నిర్ణయం తీసుకునే అధికారం కేంద్రానికి ఉంటుందని పేర్కొంది. ఇందుకు గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను కూడా అఫడవిట్ లో ఉదహరించారు. కేంద్ర ప్రభుత్వం తరుపున కార్యదర్శి ఆర్కేసింగ్ హైకోర్టులో ఈ అఫడవిట్ ను దాఖలు చేశారు.

Tags:    

Similar News