ఆ బిల్లులపై గవర్నర్ వారి సలహా కోసం
మూడు రాజధానుల బిల్లును గవర్నర్ ఇంకా ఆమోదించలేదు. గవర్నర్ ఏ నిర్ణయం తీసుకుంటారన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే దీనిపై న్యాయ శాఖ నుంచి గవర్నర్ [more]
మూడు రాజధానుల బిల్లును గవర్నర్ ఇంకా ఆమోదించలేదు. గవర్నర్ ఏ నిర్ణయం తీసుకుంటారన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే దీనిపై న్యాయ శాఖ నుంచి గవర్నర్ [more]
మూడు రాజధానుల బిల్లును గవర్నర్ ఇంకా ఆమోదించలేదు. గవర్నర్ ఏ నిర్ణయం తీసుకుంటారన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే దీనిపై న్యాయ శాఖ నుంచి గవర్నర్ అభిప్రాయాన్ని తీసుకున్నారు. దీనికి సంతృప్తి చెందని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ న్యాయనిపుణులతో చర్చిస్తున్నారు. ఢిల్లీకి చెందిన న్యాయనిపుణులతో ఆయన ఈ విషయంపై చర్చిస్తున్నట్లు చెబుతున్నారు. విపక్షాలు ఈ బిల్లులను ఆమోదించవద్దంటూ లేఖలు రాయడంతో గవర్నర్ రాజ్యాంగ నిపుణులతోనూ చర్చించనున్నారు. దీంతో మూడు రాజధానుల బిల్లులపై గవర్నర్ తీసుకునే నిర్ణయం పై టెన్షన్ నెలకొంది.