స్టీఫెన్ రవీంద్ర కు లైన్ క్లియర్

ఐపీఎస్ అధికారి స్టీఫెన్ రవీంద్ర కు లైన్ క్లియర్ అయింది. త్వరలోనే ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ గా ఆయన నియమితులు కాబోతున్నారు. తెలంగాణ ప్రభుత్వంలో ఐజిగా పనిచేస్తున్న [more]

Update: 2019-07-31 06:34 GMT

ఐపీఎస్ అధికారి స్టీఫెన్ రవీంద్ర కు లైన్ క్లియర్ అయింది. త్వరలోనే ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ గా ఆయన నియమితులు కాబోతున్నారు. తెలంగాణ ప్రభుత్వంలో ఐజిగా పనిచేస్తున్న స్టీఫెన్ రవీంద్ర ని ఆంధ్ర ప్రదేశ్ కి డిప్యూటేషన్ పై పంపాలని ప్రభుత్వం రిక్వెస్ట్ చేసింది.. ఇంటర్ స్టేట్ డిప్యుటేషన్ కావడంతో కేంద్ర ప్రభుత్వం అనుమతి తప్పనిసరి. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశాయి.ఇంటర్ స్టేట్ డిప్యుటేషన్ కి కేంద్ర హోం శాఖ ఒప్పుకుంటూ రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు సమాచారం ఇచ్చింది. రెండు మూడు రోజుల్లో స్టీఫెన్ రవీంద్రకు ఇంటర్ స్టేట్ డిప్యుటేషన్ లెటర్ అందనుంది .ఆ తర్వాత స్టీఫెన్ రవీంద్ర ఆంధ్రప్రదేశ్ కు డిప్యుటేషన్ పై వెళ్లనున్నారు. రెండు నెలల నుంచి స్టీఫెన్ రవీంద్ర లీవ్ లో ఉన్నారు.

Tags:    

Similar News