ప్రియుడితో కలసి బతకాలనుకుని భర్తను?

ప్రియుడితో కలిసి బతకాలని అనుకుంది.. అందుకు భర్త అడ్డు వస్తున్నాడు. భర్తను అడ్డు తొలగించుకోవాలని భార్య అనుకుంది. దీంతో ప్రియుడితో కలిసి భర్త హత్యకు ప్లాన్ చేసింది. [more]

Update: 2020-06-30 03:11 GMT

ప్రియుడితో కలిసి బతకాలని అనుకుంది.. అందుకు భర్త అడ్డు వస్తున్నాడు. భర్తను అడ్డు తొలగించుకోవాలని భార్య అనుకుంది. దీంతో ప్రియుడితో కలిసి భర్త హత్యకు ప్లాన్ చేసింది. పక్కాగా స్కెచ్ వేసింది. అయితే చిన్న తప్పు తో చివరకు భార్య పోలీసులకు చిక్కింది . డీసీఎం వ్యాన్ తో భర్తను ఢీ కొట్టించింది. ఆ వెనకాలే కారులో వెళ్లి భర్తను హాస్పిటల్ కు తీసుకు వెళ్లిన్నట్టుగా నటించింది. కార్లోనే భర్తను గొంతు పిసికి చంపేసింది. చివరకు భర్త కుటుంబ సభ్యులకు అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో భార్యతో పాటు ప్రియుడు మరో ఇద్దరు వ్యక్తులను మేడ్చల్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

వివాహేతర సంబంధంతో….

మేడ్చల్ మండలం సైదొని గడ్డ తండాకు చెందిన సురేష్ భార్య బబిత దుండిగల్ తండాకు చెందిన ప్రేమ్ సింగ్ కు మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. దీంతో ఎలాగైనా భర్త సురేష్ అడ్డు తొలగించు కోవాలని మే నెలలో ప్లాన్ చేసుకున్నారు.. ప్రేమ్ సింగ్ తన స్నేహితులతో కలిసి ప్రణాళిక సిద్ధం వేశారు.. మే 23 న డిసిఎం వాహనంతో ఢీకొట్టి ఆసుపత్రికి కారులో తరలిస్తున్నట్లు నటించి దారి లో గొంతు పిసికి హత్య చేశారు. మృతుడి కుటుంబ సభ్యుల అనుమానాల మేరకు విచారణ చేపట్టిన పోలీసులు ఈ సంఘటనలో మృతుడి భార్య బబిత, ప్రియుడు ప్రేమ్ సింగ్ తో పాటు మరో ముగ్గురిని నిందితులుగా నిర్దారణ చేసి అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించినట్లు మేడ్చల్ సీఐ ప్రవీణ్ రెడ్డి తెలిపారు

Tags:    

Similar News