బ్రేకింగ్ : రాజ్యసభలో గందరగోళం.. ఎంపీల సస్పెన్షన్

రాజ్యసభలో తీవ్ర గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా విపక్షాలు ఆందోళనకు దిగాయి. దీంతో పలువురు విపక్ష సభ్యులను సస్పెండ్ చేశారు. ఈ మేరకు రాజ్యసభ [more]

Update: 2020-09-21 04:10 GMT

రాజ్యసభలో తీవ్ర గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా విపక్షాలు ఆందోళనకు దిగాయి. దీంతో పలువురు విపక్ష సభ్యులను సస్పెండ్ చేశారు. ఈ మేరకు రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు నిర్ణయం తీసుకున్నారు. వారం రోజుల పాటు సస్పెండ్ చేయాలని నిర్ణయించారు. దీంతో ఛైర్మన్ పోడియం వద్దకు వెళ్లి విపక్ష సభ్యులు ఆందోళన చేస్తున్నారు. సభ్యులు నిబంధనలను పాటించాలని, సస్పెండ్ అయిన సభ్యులు సభ నుంచి వెళ్లిపోవాలని వెంకయ్యనాయుడు కోరారు. సభ్యులెవరైనా సంప్రదాయాలను పాటించాల్సిందేనని వెంకయ్యనాయుడు తెలిపారు.

Tags:    

Similar News