Tamilnadu : తమిళనాడును వదలని వాన… నేడు కూడా

తమిళనాడులో వాన ముప్పు ఇంకా పొంచి ఉందనే చెప్పాలి. వాయుగుండం తీరం దాటినా నేడు కూడా భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో [more]

Update: 2021-11-12 03:28 GMT

తమిళనాడులో వాన ముప్పు ఇంకా పొంచి ఉందనే చెప్పాలి. వాయుగుండం తీరం దాటినా నేడు కూడా భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో ప్రభుత్వం అప్రమత్తమయింది. తమిళనాడులో గత వారం రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో చెన్నై నగరంతో పాటు పదిహేను జిల్లాల్లో నష్టం సంభవించింది. మొత్తం 14 మంది వరదల కారణంగా మృత్యువాత పడ్డారు.

మరో అల్ప పీడనం…

మరో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని వాతావారణ శాఖ తెలిపింది. తూర్పు అండమాన్ మీదుగా మరో అల్పపీడనం ఏర్పడనుందని తెలిపింది. దీంతో పాఠశాలలకు, కళాశాలలకు సెలవులను పొడిగించారు. ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావద్దని ప్రభుత్వం చెబుతోంది. వరద సహాయక చర్యలను ప్రభుత్వం ముమ్మరం చేసింది.

Tags:    

Similar News