బ్రేకింగ్ : జగన్ సర్కార్ కు షాక్

సీఆర్డీఏ చట్టం రద్దు, మూడు రాజధానుల బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపుతున్నట్లు శాసనమండలి ఛైర్మన్ ప్రకటించారు. సుదీర్ఘ విరామం తర్వాత సమావేశమైన శాసనమండలిలో ఛైర్మన్  మూడు రాజధానుల [more]

Update: 2020-01-22 15:27 GMT

సీఆర్డీఏ చట్టం రద్దు, మూడు రాజధానుల బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపుతున్నట్లు శాసనమండలి ఛైర్మన్ ప్రకటించారు. సుదీర్ఘ విరామం తర్వాత సమావేశమైన శాసనమండలిలో ఛైర్మన్ మూడు రాజధానుల బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపడంతో ఇక ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలినట్లే. మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి సెలెక్ట్ కమిటీ మూడు నెలలు సమయం తీసుకునే అవకాశముంది. దీంతో శాసనమండలిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మంత్రులు ఛైర్మన్ పోడియంను చుట్టుముట్టి ఆందోళనకు దిగారు. దీంతో శాసనమండలిలో తెలుగుదేశం పార్టీ వ్యూహం సక్సెస్ అయింది. మూడు గంటల నుంచి చంద్రబాబు శాసనమండలి గ్యాలరీలోనే ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. తనకున్న విచక్షణాధికారాన్ని ఉపయోగించి సెలెక్ట్ కమిటీకి పంపుతున్నట్లు ఛైర్మన్ ప్రకటించారు.

Tags:    

Similar News