బ్రేకింగ్ : ఏపీ అసెంబ్లీలో తొలి సస్పెన్షన్
వైఎస్ జగన్ తన ఎన్నికల ప్రచారంలో 45 ఏళ్లకే పింఛను ఇస్తానని హామీ ఇచ్చారని, కానీ ఇప్పుడు అమలు చేయడం లేదంటూ తెలుగుదేశం పార్టీ సభ్యులు ఆందోళనకు [more]
వైఎస్ జగన్ తన ఎన్నికల ప్రచారంలో 45 ఏళ్లకే పింఛను ఇస్తానని హామీ ఇచ్చారని, కానీ ఇప్పుడు అమలు చేయడం లేదంటూ తెలుగుదేశం పార్టీ సభ్యులు ఆందోళనకు [more]
వైఎస్ జగన్ తన ఎన్నికల ప్రచారంలో 45 ఏళ్లకే పింఛను ఇస్తానని హామీ ఇచ్చారని, కానీ ఇప్పుడు అమలు చేయడం లేదంటూ తెలుగుదేశం పార్టీ సభ్యులు ఆందోళనకు దిగారు. జగన్ ప్రచారంలో ఇచ్చిన హామీని తాము కూడా సభలో ప్రదర్శించేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. ఇందుకు స్పీకర్ తిరస్కరించారు. ప్రశ్నోత్తరాల సమయంలో ఒక దశలో తెలుగుదేశం పార్టీ సభ్యులు పోడియం వద్దకు దూసుకు వచ్చారు. దీంతో సభా వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి ప్రతిరోజూ సభా కార్యక్రమాలకు ఆటంకం కల్పిస్తున్న కొందరిని సభ నుంచి బయటకు పంపాలని కోరారు. ఎంతకూ వినకపోవడంతో సభా సమయాన్ని వృధా చేస్తున్న అచ్చెన్నాయుడు, బుచ్చయ్య చౌదరి, నిమ్మల రామానాయుడులను ఈ సెషన్ నుంచి సస్పెండ్ చేశారు. సాధారణంగా ఒకరోజు సస్పెండ్ చేస్తారని, కానీ సెషన్ మొత్తం సస్పెండ్ చేయడంపై టీడీపీ నిరసన వ్యక్తం చేస్తోంది. సస్పెండ్ అయిన ముగ్గురు సభ్యులను మార్షల్స్ బయటకు తీసుకెళ్లారు.