కరోనాతో ముగ్గురు మృతి
భారత్‌లో కరోనాతో బుధవారం ముగ్గురు మృతి చెందినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. 614 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈ పెరుగుదల సహజంగానే ఉందని, జనం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర వర్గాలు వెల్లడిరచాయి. బహిరంగ ప్రదేశాల్లో, సమూహాల్లో సంచరించినప్పుడు మాత్రం మాస్కులు ధరించాలని హెచ్చరించింది. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని సూచించింది.

ఇక తెలంగాణలో బుధవారం 6 కరోనా కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ వెల్లడిరచారు. కరోనా సోకిన ఆరుగురూ హైదరాబాద్‌కు చెందిన వారే. రాష్ట్రంలో ఒకరు వైరస్ నుంచి కోలుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా కరోనా కేసులేమీ నమోదు కాలేదని ఆ రాష్ట్ర వైద్యారోగ్య కమిషనర్ తెలిపారు. కొవిడ్ కొత్త వేరియంట్ వేగంగా వ్యాపిస్తుండటంతో జనం అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.