రష్యా -ఉక్రెయిన్ యుద్ధానికి నేటికి ఏడాది
రష్యా -ఉక్రెయిన్ యుద్ధానికి నేటితో ఏడాది పూర్తయింది. 2022 ఫిబ్రవరి 24వ తేదీన రష్యా ఉక్రెయిన్ పై దాడులు ప్రారంభించింది.
రష్యా -ఉక్రెయిన్ యుద్ధానికి నేటితో ఏడాది పూర్తయింది. గత ఏడాది ఫిబ్రవరి 24వ తేదీన రష్యా ఉక్రెయిన్ పై దాడులు ప్రారంభించింది. అప్పటి నుంచి రష్యా ఉక్రెయిన్ ను స్వాధీనం చేసుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అయినా ఉక్రెయిన్ సేనలు తెగించి పోరాడుతున్నాయి. ఈ ఏడాది కాలంలో జరిగిన యుద్ధంలో ఎంతో మంది పౌరులు, సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఉక్రెయిన్ లో ఆస్తినష్టం పెద్దయెత్తున జరిగింది.
దేశాన్ని విడిచి...
రష్యా దాడులతో అనేక మంది ఉక్రెయిన్ విడిచి బయట దేశాలకు వెళ్లి ఆశ్రయం పొందుతున్నారు. ఆసుపత్రులు, పాఠశాలలు అనే తారతమ్యం లేకుండా రష్యా సేనలు దాడులు చేయడంతో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక భారత్ నుంచి అక్కడకు వెళ్లి విద్యను అభ్యసిస్తున్న వారిని అనేక మందిని భారత్ ప్రభుత్వం ప్రత్యేక విమానాలను పెట్టి తిరిగి స్వదేశానికి రప్పించింది. వారు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని మరీ యుద్ధం జరుగుతున్న ప్రాంతాల నుంచి బయటపడ్డారు.
ఆర్థిక పరిస్థితిపై...
ఏడాది నుంచి జరుగుతున్న యుద్ధం ఇంకా ఒక కొలిక్కి రాలేదు. రష్యా సేనలు స్వాధీనం చేసుకోవం, తిరిగి ఉక్రెయిన్ తమ అధీనంలోకి తెచ్చుకోవడంతో యుద్ధం ఆగేపరిస్థితిలేదు. ఈ యుద్ధం ప్రప్రంచలోని పలు దేశాల ఆర్థిక పరిస్థితిపై ప్రభావ చూపింది. వస్తువుల ధరలు పెరిగాయి. ముఖ్యంగా నూనె వంటి వస్తువుల ధరలు అమాంతం పెరిగాయి. రష్యా సేనలను సమర్థవంతంగా అడ్డుకుంటుండటంతో యుద్ధం ఇప్పట్లో ముగిసేట్లు లేదు.
ధరలు పెరిగి...
ప్రపంచ దేశాలలో అనేకం ఉక్రెయిన్ కు అండగా నిలిచాయి. అయినా రష్యా మాత్రం దాడులు ఆపడం లేదు. ప్రధానంగా గోధుమలు, సన్ ఫ్లవర్ ఆయిల్ ను ఉత్పత్తి చేసే రష్యా, ఉక్రెయిన్ ల మధ్య యుద్ధం జరుగుతుండటంతో వీటి ధరలు పెరిగాయి. యుద్ధం కారణంగా 70 వేల కోట్ల డాలర్ల ఆర్థిక నష్టం జరిగిందని చెబుతను్నారు. 7199 మంది పౌరులు మరణించారు. 11,756 మంది గాయపడ్డారు. రష్యా మాత్ర ఇప్పటికీ వెనక్కు తగ్గడం లేదు. ఇక ఎన్ని రోజుల పాటు యుద్ధం కొనసాగుతుందన్నది తెలియకపోవడంతో ప్రపంచ దేశాలు సయితం జోక్యం చేసుకునేందుకు వెనుకంజ వేస్తున్నాయి. అనేక ప్రాంతాలు శ్మశానాలుగా మారాయి. ఇప్పటికీ ఉక్రెయిన్ లో పరిస్థితులు కుదుటపడలేదు. సాధారణ పరిస్థితులు నెలకొనలేదు.