Tirumala : భక్తులు సాధారణమే.. హుండీ ఆదాయం మాత్రం ఘనం
తిరుమలలో నేడు భక్తుల రద్దీ కొనసాగుతుంది. భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది.;

తిరుమలలో నేడు భక్తుల రద్దీ కొనసాగుతుంది. భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. సోమవారం కావడంతో భక్తుల రద్దీ కొంత తక్కువగానే కనిపిస్తున్నప్పటికీ కంపార్ట్ మెంట్లలో భక్తులు స్వామి వారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. అయితే పూర్తి స్థాయిలో భక్తులు లేరు. పరీక్షలు సీజన్ ప్రారంభం కావడంతో భక్తుల రద్దీ కొంత తక్కువగానే ఉంది. అయితే ఇంటర్మీడియట్ పరీక్షలు రాసిన విద్యార్థులు తిరుమలకు చేరుకుని మొక్కులు ఈ నెల, వచ్చే నెలలో చెల్లించుకునే అవకాశముండటంతో మరింతగా రద్దీ పెరగుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అంచనా వేస్తున్నారు.
ఎండతీవ్రతకు...
తిరుమల కొండపై కొంత చల్లదనం ఉన్నప్పటికీ మధ్యాహ్నం నుంచి మాత్రం ఎండతీవ్రత అధికంగానే ఉంటుంది. దీంతో భక్తులు ఇబ్బంది పడకుండా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఆలయ ప్రాంగణంలో నీటిని చల్లుతూ ఎప్పటికప్పుడు చల్ల బర్చే ప్రయత్నం చేస్తున్నారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. కంపార్ట్ మెంట్లలో ఉన్న భక్తుల కోసం నిరంతరం మజ్జిగ, తాగునీరు, అన్న ప్రసాదాలను శ్రీవారి సేవకులు పంపిణీ చేస్తున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
పది గంటల సమయం...
ఈరోజు తిరుమలలోని వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లోని తొమ్మిది కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి ఉదయం 7.30 గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు నాలుగు గంటల సమయం పడుతుంది. మూడు వందల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 82,721 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 27,261 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.46 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు వెల్లడించారు.