Talliki Vandanam : తల్లికి వందనంపై బిగ్ అప్ డేట్.. నేడు కేబినెట్ కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం పథకం పై నేడు కీలక నిర్ణయం తీసుకోనుంది. విధివిధానాలను నిర్ణయించనుంది;

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం పథకం పై నేడు కీలక నిర్ణయం తీసుకోనుంది. విధివిధానాలను నిర్ణయించనుంది. గత ఎన్నికలకు ముందు చదువుకునే ప్రతి విద్యార్థికి ఏడాదికి పదిహేను వేల రూపాయలు ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ మేరకు మొన్నటి బడ్జెట్ లో లో నిధులు కేటాయింపులు చేసింది. 9,407 కోట్ల రూపాయలను కేటయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి తల్లికి వందనం పథకాన్ని అమలు చేయనున్నారు. మే నెల నుంచి లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి కానుంది. పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యే నాటికి ఈ పథకానికి సంబంధించిన నిధులు జమ చేయాలన్న ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఉంది. నేడు జరిగే మంత్రి వర్గ సమావేశంలో తల్లికి వందనం పథకం విధివిధానాలపై చర్చ జరిపి ఒక నిర్ణయం తీసుకోనున్నారు.
విద్యాసంవత్సరం ఆరంభంలోనే...
వచ్చే ఏడాది పాఠశాలలు ప్రారంభం కాగానే తల్లికి వందనం పథకాన్ని అమలు చేయనున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచడానికి తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తారు. గఇంట్లో ఎంత మంది విద్యార్థులున్నా వారికి ఈ పథకం వస్తుందని కూడా చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో పదే పదే చెప్పారు. గత ప్రభుత్వం మాత్రం అమ్మఒడి ఇంటికి ఒక్కరికే ఈ పథకాన్ని అందించింది. కానీ ఇంట్లో అందరికీ ఇస్తామని ప్రభుత్వం నేటికీ స్పష్టం చేస్తుండటంతో తాము ఈ పథకానికి ఎంపిక అవుతామా? లేదా? అన్న ఆందోళనలో లబ్దిదారులున్నారు. అయితే అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి తల్లికి వందనం నిధులను అందచేస్తామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ అర్హతలు, విధివిధానాలను నేడు నిర్ణయించే అవకాశముంది.
పథకం దక్కాలంటే...
పథకం దక్కాలంటే ఖచ్చితంగా రేషన్ కార్డు తో పాటు ఆధార్ కార్డు ఉండాలి. దీనిపై అధికారులు కసరత్తులు పూర్తి చేశారు. వివిధ పథకాలు పొందే వారితో పాటు అర్హత కలిగిన వారిని ఎంపిక చేయనున్నారు. గత ప్రభుత్వం హాజరు శాతం కూడా 75 శాతం పైన ఉంటేనే గత ప్రభుత్వం అమ్మఒడి పథకం నిధులు విడుదల చేసేది. దానిని ఈ ప్రభుత్వం అలాగే కొనసాగించనుందని తెలిసింది. తెలుపు రంగు రేషన్ కార్డు తప్పనిసరి. కుటుంబంలో ఏఒక్కరు ప్రభుత్వ ఉద్యోగి ఉన్నా ఈ పథకం వర్తించదని చెబుతున్నారు. దీంతో పాటు సంవత్సరాదాయాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటారు. అన్ని పథకాలు మాదిరిగానే దిగువ పేద తరగతి వారికి మాత్రమే అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఉంది. నేడు మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకోనున్నారు.