రెండు రైళ్లు ఢీకొన్నా…?

కాచిగూడ రైల్వే స్టేషన్ లో రెండు రైళ్లు ఢీ కొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో 30 మందికి పైగా గాయాలయ్యాయి. ఎంఎంటిఎస్ డ్రైవర్ పరిస్దితి విషమంగా ఉంది. ఎంఎంటిఎస్ [more]

Update: 2019-11-11 07:27 GMT

కాచిగూడ రైల్వే స్టేషన్ లో రెండు రైళ్లు ఢీ కొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో 30 మందికి పైగా గాయాలయ్యాయి. ఎంఎంటిఎస్ డ్రైవర్ పరిస్దితి విషమంగా ఉంది. ఎంఎంటిఎస్ డ్రైవర్ ట్రైన్ లోనే ఇరుక్కు పొయారు. ఒక ట్రాక్ లోకి వెళ్లాల్సిన రెలు మరొక ట్రాక్ లోకి వెళ్లడంతో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు చెబుతున్నారు. కర్నూలు నుంచి వస్తున్న హంద్రీ రైలు కాచిగూడ స్టేషన్ లో ఆగి ఉంది. నాలుగొ ట్రాక్ లో ఆగి ఉన్న హాంద్రీ రైలు ను ఎంఎంటిఎస్ ట్రైయిన్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 30 మందికి పైగా గాయాలయ్యాయి. ఇందులో నలుగురు పరిస్దితి విషమంగా వుంది. దీంతో కాచిగూడ మార్గంలో వెళ్లే అన్ని రైళ్ల రాకపోకలను రద్దు చేశారు. ఈ ప్రమాదంలో ఆరు బోగీలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. ఈ ఘటనపై రైల్వే అధికారులు విచారణకు ఆదేశించారు. సిగ్నలింగ్ లోపం కారణంగానే ప్రమాదం జరిగినట్లు చెబుతున్నారు.

Tags:    

Similar News