బెంగాల్ లో ఘోర రైలు ప్రమాదం.. పట్టాలు తప్పి 6 బోగీలు బోల్తా

నార్త్ బెంగాల్ లో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. పాట్నా నుంచి గౌహతి వెళ్తున్న బికనీర్ ఎక్స్ ప్రెస్..

Update: 2022-01-13 13:49 GMT

నార్త్ బెంగాల్ లో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. పాట్నా నుంచి గౌహతి వెళ్తున్న బికనీర్ ఎక్స్ ప్రెస్.. ప్రమాదవశాత్తు పట్టాలు తప్పింది. ఆరు బోగీలు పట్టాలు తప్పి పడిపోవడంతో.. వందల మంది ప్రయాణికులు బోగీల్లోనే ఉండిపోయారు. నార్త్ బెంగాల్ లోని మొయినాగురి సమీపంలోని జల్పైగురి వద్ద ఈ రైలు ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మొత్తం బికనీర్ ఎక్స్ ప్రెస్ 12 బోగీలుండగా.. ప్రమాద సమయంలో రైలులో 250 ప్రయాణికులున్నట్లు సమాచారం.

ఈ ప్రమాదంలో ఇప్పటికే ముగ్గురు ప్రయాణికులు చనిపోగా.. 20 మందికి పైగా గాయపడినట్లు తెలుస్తోంది. 15 మంది క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించగా.. కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బోగీల్లో చిక్కుకున్న ప్రయాణికులను సురక్షితంగా బయటికి తీసుకొచ్చేందుకు రెస్క్యూ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. మరోవైపు పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీకి ప్రధాని ఫోన్ చేశారు. రైలు ప్రమాదానికి సంబంధించిన వివరాలను సీఎం మమతను అడిగి తెలుసుకున్నారు. కాగా.. ఈ ప్రమాదానికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు స్థానిక అధికారులు చెప్తున్నారు. ప్రమాదంపై సమాచారం తెలుసుకునేందుకు రైల్వే అధికారులు హెల్ప్ లైన్ నంబర్లను ఏర్పాటు చేశారు. 0362731622, 03612731623 నంబర్లకు ఫోన్ చేసి బంధువులు, శ్రేయోభిలాషులకు సంబంధించిన వివరాలను తెలుసుకోవచ్చని తెలిపారు. 



Tags:    

Similar News