ట్రిపుల్ తలాక్ బిల్లుకు ఓకే
ట్రిపుల్ తలాక్ బిల్లును లోక్ సభ ఆమోదించింది. బిల్లుపై సుదీర్ఘంగా జరిగిన చర్చలో కాంగ్రెస్ పార్టీ ఇది రాజకీయ ప్రయోజనాలకోసమే తెస్తున్న బిల్లు అని ఆరోపించింది. బీజేపీ [more]
ట్రిపుల్ తలాక్ బిల్లును లోక్ సభ ఆమోదించింది. బిల్లుపై సుదీర్ఘంగా జరిగిన చర్చలో కాంగ్రెస్ పార్టీ ఇది రాజకీయ ప్రయోజనాలకోసమే తెస్తున్న బిల్లు అని ఆరోపించింది. బీజేపీ [more]
ట్రిపుల్ తలాక్ బిల్లును లోక్ సభ ఆమోదించింది. బిల్లుపై సుదీర్ఘంగా జరిగిన చర్చలో కాంగ్రెస్ పార్టీ ఇది రాజకీయ ప్రయోజనాలకోసమే తెస్తున్న బిల్లు అని ఆరోపించింది. బీజేపీ మాత్రతం తమకు ఎటువంటి రాజకీయ ప్రయోజనాలు లేవని, దాదాపు ప్రపంచవ్యాప్తంగా ఇరవై దేశాల్లో ట్రిపుల్ తలాక్ ను నిషేధించారని తెలిపింది. తర్వాత దీనిపై ఓటింగ్ జరిగింది. బిల్లుకు అనుకూలంగా 245 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 11 ఓట్లు వచ్చాయి. కాగా కాంగ్రెస్, డీఎంకే, సమాజ్ వాదీ పార్టీ వాకౌట్ చేసింది. కాంగ్రెస్ ఈ బిల్లును జాయింట్ సెలక్షన్ కమిటీకి పంపాలని కోరింది. అయితే ప్రభుత్వం దీన్ని తిరస్కరించింది. ఇప్పటి నుంచి ట్రిపుల్ తలాక్ చెబితే మూడేళ్ల జైలు శిక్ష పడనుంది.