సైకే జై అన్నారు

హుజుర్‌నగర్‌ ఉప ఎన్నిక అధికార పార్టీకి భారీవిజయాన్ని చేకూరుస్తోంది. తుది ఫలితం మరికాసేపల్లో వెల్లడి కానుంది. ఇప్పటి వరకు నాలుగు మండలాల్లో కౌంటింగ్‌ పూర్తికాగా ఈ నాలుగు [more]

Update: 2019-10-24 08:07 GMT

హుజుర్‌నగర్‌ ఉప ఎన్నిక అధికార పార్టీకి భారీవిజయాన్ని చేకూరుస్తోంది. తుది ఫలితం మరికాసేపల్లో వెల్లడి కానుంది. ఇప్పటి వరకు నాలుగు మండలాల్లో కౌంటింగ్‌ పూర్తికాగా ఈ నాలుగు మండలాల్లోనూ టీఆర్‌ఎస్‌కే ఆధిక్యం వచ్చింది. మొత్తం 22 రౌండ్లకు గానూ ఇప్పటి వరకు 13 రౌండ్ల ఫలితాలు వెలువడ్డాయి. 13వ రౌండ్‌ కౌంటింగ్‌ పూర్తయ్యే సరికి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సైదిరెడ్డికి 25,366 ఓట్ల మెజార్టీ వచ్చింది. కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతి రెండో స్థానంలో, మూడో స్థానంలో స్వతంత్ర అభ్యర్థి కిరణ్‌ ఉన్నారు.

 

 

Tags:    

Similar News