అసెంబ్లీలో తన లవ్ స్టోరీ చెప్పిన ఎమ్మెల్యే

తెలంగాణ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన పద్మారావు గౌడ్ కు అన్ని పార్టీల శాసనసభ్యులు అభినందనలు తెలిపారు. పద్మారావు గౌడ్ తో తమ అనుబంధం, [more]

Update: 2019-02-25 09:48 GMT

తెలంగాణ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన పద్మారావు గౌడ్ కు అన్ని పార్టీల శాసనసభ్యులు అభినందనలు తెలిపారు. పద్మారావు గౌడ్ తో తమ అనుబంధం, ఉద్యమంలో, మంత్రిగా పద్మరావు పనితీరును వారు గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ ప్రసంగం సభలో నవ్వులు పూయించింది. పద్మారావుకు అభినందనలు తెలిపిన ఆయన… తనతో ఆయనకున్న అనుబంధాన్ని గుర్తు చేశారు. తాను ఓయూ విద్యార్థిగా, టీఆర్ఎస్ వి అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ప్రేమ వివాహం చేసుకోవడానికి పద్మారావు సహకరించారని తెలిపారు.

తల్లిదండ్రులతో మాట్లాడి.. ఒప్పించి

పద్మారావు సామాజకవర్గానికి చెందిన అమ్మాయిని తాను ప్రేమిస్తే… తనకు ఏమీ లేదని అమ్మాయి తల్లిదండ్రులు పెళ్లి చేయడానికి ఇష్టపడలేదన్నారు. ఆ సమయంలో పద్మారావు.. అమ్మాయి తల్లిదండ్రులతో మాట్లాడి.. బాల్క సుమన్ మంచోడు.. కేసీఆర్ కు దగ్గరవుతాడు.. ఎప్పటికైనా ఎమ్మెల్యే అవుతాడు అని బుజ్జగించి ఒప్పించారని సుమన్ గుర్తు చేశారు. పెళ్లి కూడా పద్మారావు దగ్గరుండి చేయించారన్నారు. ఉద్యమంలో కూడా తనకు ఆయన సహకారం ఉండేదన్నారు. బాల్క సుమన్ ప్రసంగిస్తునంనత సేపూ పద్మారావుతో పాటు సభలోని సభ్యులంతా నవ్వులు చిందించారు.

Tags:    

Similar News