ఎన్నికల వేళ తెలంగాణ రాష్ట్ర సమితి దూకుడు పెంచింది. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్న వారిని ఇక ఉపేక్షించకూడదని నిర్ణయించుకుంది. ఇటీవల చేవెళ్ల పార్టీ పార్లమెంటు సభ్యుడు కొండా విశ్వేశ్వరరెడ్డి ఊహించని షాక్ ఇవ్వడంతో తేరుకున్న అధిష్టానం మిగిలిన వారు పార్టీని వీడకముందే బయటకు పంపేయాలని టీఆర్ఎస్ నిర్ణయించింది. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కె.యాదవరెడ్డిని సస్పెండ్ చేస్తూ కె.చంద్రశేఖర్ రావు నిర్ణయం తీసుకున్నారు. యాదవరెడ్డి గత కొంతకాలంగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, అందుకే సస్పెండ్ చేస్తున్నట్లు టీఆర్ఎస్ ప్రకటించింది. పార్టీ నుంచి యాదవరెడ్డిని బహిష్కరించడం వెనక ఆయన కూడా కొండా వెంట వెళతారని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది.