పీకే ప్లాన్.... కేసీఆర్ కొత్త జాతీయ పార్టీ

టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ జాతీయ రాజీకీయాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఢిల్లీ వేదికగా పాలిటిక్స్ చేయడానికి రెడీ అయ్యారు

Update: 2022-06-11 02:27 GMT

తెలంగాణ రాష్ట్ర సమితి కేసీఆర్ జాతీయ రాజీకీయాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఆయన ఢిల్లీ వేదికగా పాలిటిక్స్ చేయడానికి రెడీ అయిపోయారు. త్వరలో కొత్త పార్టీ పేరును ఆయన ప్రకటించనున్నారని తెలిసింది. భారత రాష్ట్రీయ సమితి (బీఆర్ఎస్) పేరును త్వరలోనే ఢిల్లీలో ప్రకటించేందుకు కేసీఆర్ సిద్ధమవుతున్నారు. ఈ నెలాఖరులోనే ప్రకటించి దేశంలో పార్టీ ఆవశ్యకతను ఆయన వివరించనున్నారని తెలిసింది.

జాతీయ రాజకీయాల వైపు....
గత కొంతకాలంగా కేసీఆర్ జాతీయ రాజకీయాలవైపు మొగ్గు చూపుతున్నారు. కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా ఒక వేదికను నిర్మించాలనుకుంటున్న కేసీఆర్ ముఖ్యనేతలతో జరిపిన సమావేశంలో తన మనసులో మాటను వెల్లడించినట్లు తెలిసింది. అయితే బీఆర్ఎస్ ఈ నెల 19వ తేదన రాష్ట్ర కార్యవర్గ సమావేశాలను నిర్వహించి అందులో దీనిని నిర్ణయించి ప్రకటించే అవకాశముందని సమాచారం.
దశాబ్దాలుగా.....
బీజేపీ, కాంగ్రెస్ లు కొన్ని దశాబ్దాలుగా దేశాన్ని పాలిస్తున్నా సమస్యలను పట్టించుకోవడం లేదని కేసీఆర్ అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రాలను రెండు పార్టీలూ పట్టించుకోవడం లేదని, కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయ శక్తి కోసం దేశ ప్రజలు ఎదురు చూస్తున్నారని కేసీఆర్ అభిప్రాయపడినట్లు తెలిసింది. రాష్ట్రపతి ఎన్నికల్లో తాము కీలక భూమిక పోషించనున్నామని కూడా కేసీఆర్ సమావేశంలో చెప్పినట్లు సమాచారం. దేశంలో బీజేపీ ఆగడాలు శృతి మించి పోయాయయని, వీటికి అడ్డుకట్ట వేసే ప్రయత్నం జరగాలని కేసీఆర్ బలంగా అభిప్రాయపడుతున్నారు.
రాణిస్తారా?
టీఆర్ఎస్ ను జాతీయ పార్టీగా ప్రకటించేకంటే కొత్త పార్టీ ఆవిర్భావమే మంచిదని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. అందుకే బీఆర్ఎస్ పేరును ఖరారు చేశారు. బీజేపీ ప్రభుత్వం రాష్ట్రాల హక్కులను కాలరాచే విధంగా వ్యవహరిస్తుందన్నారు. తమతో కలసి వచ్చే పార్టీలతో వ్యూహాన్ని రూపొందించుకుని ముందుకు వెళ్లాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారు. అయితే కేసీఆర్ ఈ ఆలోచన వెనక ప్రశాంత్ కిషోర్ ఉన్నట్లు తెలిసింది. పీకే సలహా, సూచనల మేరకే జాతీయపార్టీ ఆలోచనకు కేసీఆర్ వచ్చారని చెబుతున్నారు. కొత్త రాష్ట్రం ఏర్పాటు, తర్వాత దాని సారధ్యంలో విజయం సాధించిన కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో ఏ విధంగా రాణిస్తారన్నది వేచి చూడాలి.


Tags:    

Similar News