రేపే సమావేశం.. అందరికీ ఉత్కంఠ

టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం రేపు జరగనుంది. సమావేశాన్ని అకస్మాత్తుగా ఏర్పాటు చేయడంపై పార్టీలో పలు రకల చర్చలు జరుగుతున్నాయి. రేపు తెలంగాణ భవన్ లో కేసీఆర్ [more]

Update: 2021-02-06 01:20 GMT

టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం రేపు జరగనుంది. సమావేశాన్ని అకస్మాత్తుగా ఏర్పాటు చేయడంపై పార్టీలో పలు రకల చర్చలు జరుగుతున్నాయి. రేపు తెలంగాణ భవన్ లో కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ కార్యవర్గ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి మంత్రులతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ ఛైర్మన్లు, జడ్పీ ఛైర్మన్లతో పాము మున్సిపల్ ఛైర్మన్లు కూడా పాల్గొంటారు. ఈ సమావేశంలో కీలక నిర్ణయాన్ని కేసీఆర్ ప్రకటిస్తారని అంటున్నారు. ఏప్రిల్ 27న పార్టీ వార్షికోత్సవం సందర్భంగా చేయాల్సిన కార్యక్రమాల గురించి కూడా కేసీఆర్ వివరిస్తారంటున్నారు. దీంతో పాటు కేటీఆర్ ను ముఖ్యమంత్రి ని చేసే అంశం కూడా ఈ సమావేశంలో ప్రస్తావనకు వచ్చే అవకాశముంది.

Tags:    

Similar News